భారీ వర్షాల ధాటికి వరద గుప్పిట చిక్కిన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు వరదల వల్ల మరణించినవారి సంఖ్య 56కి పెరిగినట్లు అక్కడి మీడియా తెలిపింది. 10 బిలియన్ డాలర్ల నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు వెల్లడించింది.






ఈ వరదలు 30లక్షల మందిపై ప్రభావం చూపించగా, 3లక్షల 76వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 8 వేల మంది సైనికులు సహా భారీ సంఖ్యలో మోహరించిన సిబ్బంది.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు హెనన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో విరాళాల కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: వరదల బీభత్సం- 61 మంది మృతి