ETV Bharat / international

నేపాల్​ ప్రధానికి ఊరట- వెనక్కి తగ్గిన ప్రచండ!

author img

By

Published : Jul 20, 2020, 1:29 PM IST

నేపాల్​ రాజకీయ సంక్షోభానికి తెరపడనుందా? సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రధాని కేపీ శర్మ ఓలికి ఊరట లభించిందా? అంటే మీడియా వర్గాలు అవుననే చెబుతున్నాయి. అసలు ఏం జరిగింది?

Dahal drops calls to quit Oli, saves NCP
నేపాల్​ ప్రధాని ఓలీకి ఊరట.. వెనక్కి తగ్గిన ప్రచండ!

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి ఊరట లభించింది. అభిప్రాయబేధాలతో కొద్ది రోజులుగా ఓలీ ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్​ చేస్తోన్న అధికార కమ్యూనిస్ట్​ పార్టీ కో-ఛైర్మన్​ ప్రచండ వెనక్కి తగ్గారు.

తన డిమాండ్​ను ఉపసంహరించుకున్నారని... ప్రచండ, ఓలి మధ్య ఒప్పందం కుదిరేందుకు అడ్డంకులు తొలిగిపోయాయని పేర్కొంది కాఠ్​మాండూ పోస్ట్​.

కొద్ది రోజుల క్రితం భారత్​లోని మూడు భూభాగాలను తమవేనని పేర్కొంటూ కొత్త మ్యాప్​ను పార్లమెంట్​లో ఆమోదించుకున్నారు ఓలి. తనను పదవి నుంచి దింపేందుకు భారత్​ ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి సొంత పార్టీలో ఓలిపై వ్యతిరేకత మొదలైంది. పార్టీలోని సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీ నియమాలకు విరుద్ధంగా ఓలి రెండు పదవులు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తోటి సభ్యులు. ప్రధాని పదవి, లేదంటే పార్టీ ఛైర్మన్​ పదవిని వదులుకోవాలని పట్టుబడుతున్నారు. అయితే.. ఇందుకు ఓలి నిరాకరిస్తున్నారు.

అంతా భావించినా..

2017లో సాధారణ ఎన్నికల్లో నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ విజయం సాధించాక ఓలి ప్రధాని పదవి చేపట్టారు. ఎన్నికలకు ముందే ఓలి, ప్రచండ నేతృత్వంలోని రెండు కమ్యూనిస్ట్​ పార్టీలు కలిసిపోయాయి. ఎన్నికల తర్వాత ప్రధాని పదవిని ఓలి, ప్రచండ సమానంగా పంచుకుంటారని అంతా భావించారు. కానీ, రెండున్నరేళ్ల కాలం పూర్తయినప్పటికీ.. పదవిని వదులుకునేందుకు నిరాకరిస్తున్నారు ఓలి. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఓలి పార్టీలో, ప్రజల్లో ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.

ఇదీ చూడండి: నేపాల్‌ ప్రధాని ఓలీ 'ఓటి' రామాయణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.