ETV Bharat / international

హింసకు కేంద్రంగా హాంకాంగ్​ విశ్వవిద్యాలయం

హాంకాంగ్​లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణలతో నగరం అంతటా హింసాయుత పరిస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా స్థానిక విశ్వవిద్యాలయంలో నిరసనకారులు తలదాచుకుంటున్నారు. లోపలికి రాకుండా పోలీసులను నిలువరించడానికి పెట్రోల్​ బాంబులు, బాణాలు ఉపయోగిస్తున్నారు.

author img

By

Published : Nov 18, 2019, 3:13 PM IST

హింసకు కేంద్రంగా హాంకాంగ్​ విశ్వవిద్యాలయం
హాంగాంగ్​లో నిరసనల దృశ్యాలు

హాంకాంగ్​లో నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య అనుకూలవాదులు చేస్తున్న నిరసనల్లో హింస తాండవిస్తోంది.

హాంకాంగ్ విశ్వవిద్యాలయంలో తలదాచుకుంటున్న నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి బాష్పవాయు గోళాలు, జలఫిరంగులు ప్రయోగించారు. కొద్దిరోజులుగా విశ్వవిద్యాలయంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఉంటున్న నిరసనకారులు... పోలీసులను లోనికి రాకుండా అడ్డుకుంటున్నారు. పెట్రోల్​ బాంబులు, బాణాలతో భద్రతా దళాలపై దాడి చేస్తున్నారు. ప్రతి దాడిలో ఓ ఆందోళనకారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

లోపల ఉన్న కొంతమంది నిరసనకారులను పోలీసులు బయటకు తీసుకురాగలిగారు. యూనివర్శిటీ చుట్టూ భారీ వలలను ఏర్పాటు చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Mumbai, Nov 17 (ANI): Former Maharashtra chief minister and Bharatiya Janata Party (BJP) leader Devendra Fadnavis paid tribute to Balasaheb Thackeray on his 7th death anniversary in Mumbai. BJP leaders Pankaja Munde and Vinod Tawde were also present. Balasaheb Thackeray was the founder of Shiv Sena. BJP-Shiv Sena alliance broke in Maharashtra over CM's post after elections.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.