రక్షణ బడ్జెట్ను చైనా ఏటికేడు పెంచుకుంటూపోతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైనిక వ్యవస్థ కలిగిన చైనా.. ఈ సంవత్సరం రక్షణ రంగానికి 209 బిలియన్ డాలర్లు కేటాయించినట్లు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ పార్టీ (ఎన్పీసీ) పార్లమెంట్లో ప్రకటించింది. ఇది గతేడాదితో పోల్చుకుంటే 6.8 శాతం అధికంగా ఉంది.
ఇది ఎవరినీ భయపెట్టడానికి కాదని.. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికేనని చైనా స్పష్టం చేసింది. శాంతియుత అభివృద్ధి, భద్రతా విధానాలకు తమ దేశం కట్టుబడి ఉందని పేర్కొంది. ఒక దేశం ఇతరులకు ముప్పు కలిగిస్తుందా లేదా అనేది.. ఆ దేశ రక్షణ విధానంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది.
ఇదీ చూడండి: 2021లో చైనా జీడీపీ టార్గెట్ ఎంతంటే..?