ETV Bharat / international

పాక్​తో కలిసి చైనా కుట్ర- అధునాతన యుద్ధనౌకతో.. - cscc

అత్యంత అధునాతన యుద్ధనౌకను పాకిస్థాన్​కు చైనా(China Pakistan News) సరఫరా చేసింది. విదేశాలకు చైనా ఇలాంటి యుద్ధనౌకను ఎగుమతి చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

China delivers warship to Pakistan
పాక్​ నేవీకి చైనా సాయం
author img

By

Published : Nov 9, 2021, 11:29 AM IST

భారత్​కు వ్యతిరేకంగా పాక్​తో కలిసి చైనా కుట్రలు పన్నుతోందా? భారత్​పై దాడికి పాక్​ను పావుగా వాడుకుంటోందా? చైనా ఇటీవలి చర్యలను బట్టి.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా.. అత్యంత అధునాతన యుద్ధనౌకను పాక్​కు చైనా(China Pakistan News) సరఫరా చేసింది. ​ఇలాంటి యుద్ధనౌకను విదేశాలకు చైనా(China Pakistan News) ఎగుమతి చేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు చైనా మీడియా తెలిపింది.

చైనా స్టేట్ షిప్ ​బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్​(సీఎస్​సీసీ) నిర్మించిన ఈ యుద్ధనౌకను పాకిస్థాన్​ నౌకాదళానికి డ్రాగన్ అప్పగించింది. షాంఘైలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని అందించినట్లు 'గ్లోబల్ టైమ్స్​' వెల్లడించింది. టైప్​ 054ఏ/పీ రకానికి చెందిన ఈ యుద్ధనౌకకు పాకిస్థాన్ నేవీ.. 'పీఎన్​ఎస్​ తుఘ్రిల్'​గా నామకరణం చేసినట్లు చెప్పింది.

పాక్ కోసం నిర్మిస్తున్న నాలుగు టైప్​ 054 యుద్ధనౌకల్లో పీఎన్​ఎస్​ తుఘ్రిల్.. మొదటిదని పాకిస్థాన్ నౌకాదళం తెలిపింది. సాంకేతికంగా అధునాతనమైన ఈ యుద్ధనౌక.. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి నింగి సహా నీటి అడుగున కూడా పోరాడగల వేదిక అని వివరించింది. విస్తృతమైన నిఘా సామర్థ్యాలు దీని సొంతం అని పేర్కొంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.