చైనా హెబేయ్ రాష్ట్రం చెంగ్దే పట్టణంలో సందడి చేశారు రోలర్ స్కేటింగ్ స్పోర్ట్స్‌మన్ వెస్ బ్లోండియూ. అక్కడున్న ఓ పర్వతంపై రోలర్ స్కేటింగ్ చేసి స్థానికులను ఉత్సాహపరిచారు.
ఫ్రాన్స్‌కు చెందిన బ్లోండియూకు అత్యంత సాహసోపేత స్పోర్ట్స్‌మన్‌గా గుర్తింపు ఉంది. 'రోలర్మన్' అని పేరుంది. రోలర్ స్కేటింగ్‌లో గంటకు 112 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి బ్లోండియా నెలకొల్పిన రికార్డును ఎవరూ అధిగమించలేకపోతున్నారు. రోలర్ స్కేటింగ్ కోసం 32 చక్రాల ప్రత్యేక సూట్‌ను రూపొందించుకున్నారు బ్లోండియూ.
'చైనీస్ జోడియాక్' సినిమాలో హాలీవుడ్ నటుడు జాకీచాన్ చంగ్దే పర్వతంపై నుంచి రోలర్ స్కేటింగ్ చేశారు. ఆ సినిమా యాక్షన్ సన్నివేశాలకు బ్లోండియూనే దర్శకత్వం వహించారు. జాకీచాన్‌కు డూప్‌గానూ నటించారు.
"చెంగ్దేకు రావడం ఇదే తొలిసారి. ఈ పర్వతం బాగా నచ్చింది. మా దేశంలో ఉన్నట్లే అనిపించింది. స్కేటర్స్కు అనువైన ప్రదేశం. ఇక్కడ రోలర్ స్కేటింగ్ చేసినందుకు సంతోషంగా ఉంది. వీలైతో మరోసారి ఇక్కడికి వస్తా."
-బ్లోండియూ, రోలర్మన్
ఇదీ చూడండి: వివిధ దేశాల్లో నిరంకుశత్వంపై ప్రజాగ్రహం!