ETV Bharat / international

సిరియాలో వైమానిక దాడి.. 56 మంది మృతి

సిరియాలో జరిగిన వైమానిక దాడిలో 56 మంది మరణించారు. మరో 50మందికి గాయాలు అయ్యాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్​ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడి వెనుక సిరియా అధ్యక్షుడు బషీర్​ అసద్​కు సన్నిహితంగా ఉండే రష్యా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Airstrike kills over 50 rebel fighters in Syria
సిరియాలో వైమానిక దాడి.. 56 మంది మృతి
author img

By

Published : Oct 26, 2020, 7:37 PM IST

వాయువ్య సిరియాలోని ఇడ్లిబ్​ ప్రాంతంలోని తిరుగుబాటుదారుల శిక్షణా శిబిరంపై సోమవారం వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో 56 మంది సైనికులు మరణించినట్లు సిరియన్​ అబ్జర్వేటరీ ఫర్​ హ్యూమన్​ రైట్స్​ తెలిపింది. మరో 50 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

టర్కీ మద్దతు గ్రూపుల్లో ఒకటైన ఫైలాక్ అల్-షామ్ శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగినట్లు ఆ గ్రూపు ప్రతినిధి యూసఫ్ హమ్మౌద్​ తెలిపారు. చనిపోయిన వారిలో కొందరు నాయకులు కూడా ఉన్నట్లు హమ్మౌద్​ వెల్లడించారు.

ఈ ఏడాది ప్రారంభంలో టర్కీ, రష్యా మధ్య దాడులకు వ్యతిరేకంగా ఒప్పంది జరిగింది. కానీ ఈ దాడితో సంధి ఫలితం ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చూడండి: ఉగ్రసంస్థలతో ఆ అధ్యక్షుడికి సన్నిహిత సంబంధాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.