ETV Bharat / international

తాలిబన్లతో అఫ్గాన్​ ప్రభుత్వ చర్చలు- శాంతి నెలకొనేనా?

అమెరికా,నాటో దళాల ఉపసంహరణ వేళ తాలిబన్ల ఆక్రమణతో అట్టుడుకుతున్న అఫ్గానిస్థాన్‌లో శాంతిచర్చల పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. తాలిబన్లు, అఫ్గాన్ ప్రభుత్వం మధ్య దోహా వేదికగా శుక్రవారం చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు అఫ్గాన్ అధికార వర్గాలు వెల్లడించాయి.

afghan peace talks
అఫ్గాన్​లో శాంతి చర్చలు
author img

By

Published : Jul 14, 2021, 1:11 PM IST

Updated : Jul 14, 2021, 1:59 PM IST

అఫ్గానిస్థాన్​లో శాంతి చర్చల పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. అఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్లు శాంతి చర్చలకు సిద్ధమవుతున్నారు. ఖతార్ రాజధాని దోహాలో ఈ శుక్రవారం భేటీ జరగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు వైదొలగుతున్న నేపథ్యంలో చర్చలు ఊరటనిచ్చే పరిణామం.

ఈ సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారి అబ్దుల్లా అబ్దుల్లా నాయకత్వం వహించనున్నారు. అఫ్గాన్​ మాజీ అధ్యక్షుడు హమీద్​ కర్జయ్​​ కూడా సమావేశంలో పాలుపంచుకోనున్నారు. చర్చల అవకాశాన్ని చేజార్చుకోవద్దని కర్జయ్​.. ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.

మూడొంతుల ప్రాంతం ఆక్రమణ..

అఫ్గాన్​లో ఇప్పటికే చాలా ప్రాంతాలు తాలిబన్ల అదుపులోకి వెళ్లాయి. దేశంలో దాదాపుగా మూడు వంతుల ప్రాంతాలు (421 జిల్లాలు) తాలిబన్ల అధికారంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇరాన్​, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్​తో సరిహద్దును పంచుకుంటున్న వ్యూహాత్మకమైన జిల్లాలు సైతం వారి ఆధినంలో ఉన్నాయి. సైన్యం నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే చాలా ప్రాంతాలను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దాదాపు 1000 మంది సైనికులు అఫ్గాన్ విడిచి తజకిస్థాన్​కు పారిపోయినట్లు సమాచారం.

తాలిబన్లు సృష్టించిన హింసాత్మక ఘటనలతో భవిష్యత్​పై ఆందోళనతో యువత ఆ దేశాన్ని వీడి వెళ్లిపోతున్నారు. అఫ్గాన్​లో ఉన్న తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఫ్రాన్స్​ ప్రత్యేక విమానాలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా సైతం తమ సైనికులను అఫ్గాన్​ నుంచి వెనక్కి తీసుకెళ్లింది. భారత్​ కూడా తమ దౌత్య వేత్తలను స్వదేశానికి తరలించింది

ఇదీ చదవండి: అఫ్గాన్ బాధ్యతల నుంచి వైదొలిగిన అమెరికా టాప్​ కమాండర్​

Jacob Zuma: జుమాను జైలుపాలు చేసిన గుప్తా బ్రదర్స్‌!

Last Updated : Jul 14, 2021, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.