ETV Bharat / international

'ఇండో-పసిఫిక్​ దేశాల వృద్ధే భారత్​కు ప్రధానం' - క్వాడ్​ లేటెస్ట్ న్యూస్​

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అన్ని దేశాల భద్రత, ఆర్థిక ప్రయోజనాలే భారత్​కు ప్రధానాంశమని క్వాడ్​ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.

Advancing key security and economic interests in Indo-Pacific a priority: Jaishankar
'ఇండో-పసిఫిక్​ దేశాల ఆర్థిక అభివృద్ధే భారత్​ లక్ష్యం'
author img

By

Published : Oct 6, 2020, 5:34 PM IST

ఇండో-పసిఫిక్​ ప్రాంతంలోని అన్ని దేశాల భద్రత, ఆర్థిక ప్రయోజనాల అభివృద్ధే భారత్​ ప్రధాన ఉద్దేశమని టోక్యోలో జరిగిన క్వాడ్​ సమావేశంలో భారత్​ స్పష్టంచేసింది. భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్​ కూటమి దేశాల విదేశాంగ మంత్రుల భేటీకి హాజరైన విదేశాంగ మంత్రి జైశంకర్​... ఈమేరకు దిల్లీ వాణి వినిపించారు.

"భాగస్వామ్య విలువలతో శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలు సమష్టిగా స్వేచ్ఛాయుత, సమ్మిళిత ఇండో-పసిఫిక్ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి, చట్టంలోని నియమాలను గౌరవించాలి. పారదర్శకతతో అంతర్జాతీయ సముద్రాల్లో స్వేచ్ఛ, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరస్పరం గౌరవించుకోవాలి. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి."

- జైశంకర్

ఇండో-పసిఫిక్ భావన విస్తృతంగా ఆమోదం పొందడం సంతృప్తికరంగా ఉందన్నారు జైశంకర్.​

ఇదీ చూడండి: పాంపియోతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.