ETV Bharat / international

చైనాలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు - earthquake updates

చైనా హుబే రాష్ట్రంలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది.

5.1-magnitude quake jolts China; tremors felt in Beijing
చైనాలో భూకంపం.. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత
author img

By

Published : Jul 12, 2020, 11:50 AM IST

చైనాలో కరోనా ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. మరోవైపు వరదల వంటి ప్రకృత్తి విపత్తులు.. తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా భూకంపం చైనాను వణికించింది. హుబే రాష్ట్రంలోని తాంగ్​షాన్​ నగరంలో మధ్యస్థాయి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతగా నమోదైంది. బీజింగ్​ సహా సమీప ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు ఏర్పడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మేరకు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా తెలిపింది.

5.1-magnitude quake jolts China; tremors felt in Beijing
ఒలికిపోయిన ద్రావణాలు

చెల్లాచెదురుగా పడిన బాటిల్స్​

24 నిమిషాల వ్యవధిలో రెండోసారి..

గుయే జిల్లాలో స్థానిక సమయం ప్రకారం ఉదయం 6 గంటల 38 నిమిషాలకు మొదటసారి భూమి కంపించగా... రెండోసారి 7 గంటల 2 నిమిషాలకు 2.2 తీవ్రతతో స్వల్పంగా ప్రకంపనలు ఏర్పడ్డాయి. దీంతో ఇళ్లలోని సామగ్రి చిందరవందరగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు... ప్రభావిత ప్రాంతాలకు సహాయ బృందాలను పంపించారు. ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.

చైనాలో భూకంపం.. రిక్టర్​ స్కేలుపై 5.1 తీవ్రత
5.1-magnitude quake jolts China; tremors felt in Beijing
కింద పడిన అద్దం

ఊడిపోయిన టైల్స్​

తాంగ్​షాన్​లో 1976లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,40,000 మందికి ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: లూసియానా ప్రైమరీలో ట్రంప్, బైడెన్ ఘనవిజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.