ETV Bharat / international

మయన్మార్ గని ప్రమాదంలో 162కు చేరిన మృతులు

మయన్మార్​లోని జాడే మైనింగ్​లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 162కు పెరిగింది. ఇంకా కొంత మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

author img

By

Published : Jul 3, 2020, 5:06 AM IST

162 killed in Myanmar jade mine landslide
మయన్మార్ గని ప్రమాదం

మయన్మార్ కాచిన్​ రాష్ట్రం హాపాకంత్​లోని గనిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జాడే మైనింగ్​లో కూలీలు పనిచేస్తోన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది.. మట్టిదిబ్బల్లో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

కాచిన్‌ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. 2015లో కొండచరియలు విరిగిపడి 116 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్​..

ప్రపంచంలోనే భారీ, అత్యంత లాభదాయకమైన పరిశ్రమగా జాడే మైనింగ్ పేరొందింది. ఇది దేశంలోని అతి పెద్ద నగరమైన యూంగోన్​కు సుమారు 950 కిలోమీటర్ల (600 మైళ్లు) దూరంలో ఉంది. ఇక్కడి కార్మికులంతా ఎలాంటి ఒప్పందం లేకుండా సాధారణ కూలీలుగానే పనిచేస్తూ.. అక్కడే ఉన్న మట్టిదిబ్బల వద్ద జీవనం సాగిస్తున్నారు.

ఇదీ చూడండి: పాక్​లో రెండు తెగల మధ్య ఘర్షణ.. 15మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.