అఫ్గాన్‌లోని హెరత్, లాఘ్మన్ రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో మొత్తం 13 మంది చనిపోయారు. మరో 20 మందికి గాయపడ్డారు. కేష్-ఈ-కోహ్న జిల్లాలో జరిగిన పేలుడులో అయిదుగురు పౌరులు మరణించగా 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
మరో పేలుడు అస్మార్ జిల్లాలో జరిగింది. దీనిలో ముగ్గురు స్థానికులు మరణించగా.. మరో ఏడుగురు క్షతగాత్రులయ్యారు. వారిలో ఒక పోలీసు ఆఫీసరు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి పోలీసు వాహనం లక్ష్యంగా జరిగిందన్నారు. ఈ పేలుళ్ల వెనుక ఏ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందో తెలియాల్సి ఉంది.