ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌కు గడగడలాడుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,28,41,504 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5,67,628 మంది వైరస్‌కు బలయ్యారు.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 33,55,646 | 1,47,473 |
బ్రెజిల్ | 18,40,812 | 71,492 |
రష్యా | 7,20,547 | 11,205 |
పెరూ | 3,22,710 | 11,682 |
చిలీ | 3,12,,029 | 6,881 |
స్పెయిన్ | 3,00,988 | 28,403 |
మెక్సికో | 2,95,268 | 34,730 |
బ్రిటన్ | 2,88,953 | 44,798 |
దక్షిణాఫ్రికా | 2,64,184 | 3,971 |
అమెరికాలో మళ్లీ...
అమెరికాలో కరోనా ఉద్ధృతి తగ్గింది అనుకుంటున్న సమయంలో.. వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. కొత్తగా 66 వేలకు పైగా కేసులు నమోదుకావడం అక్కడి అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ప్రకారం.. ఒక్కరోజులో అక్కడ 66,528 కేసులు వెలుగుచూశాయి. మరో 732 మంది మృతిచెందారు.
బ్రెజిల్లో వైరస్ విజృంభిస్తోంది. శనివారం.. అక్కడ మరో 36 వేల కేసులు, 968 మరణాలు నమోదయ్యాయి.
లక్షణాల్లేవ్...
దక్షిణాఫ్రికాలో పరిస్థితి విచిత్రంగా ఉంది. తమ దేశంలో కరోనా వైరస్ సోకిన 50-60 శాతం మంది యువకుల్లో అసలు లక్షణాలు కనిపించడం లేదని ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. ఎక్కువ మందిలో.. అసలు కరోనా సోకిన విషయాన్నే పసిగట్టలేకపోతున్నామని వైద్యులు తెలిపారు.