ETV Bharat / international

భారత్​ వెలుపల తొలి యోగా వర్సిటీ ప్రారంభం - Vivekananda Yoga University' news

ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పలు దేశాలు ఘనంగా నిర్వహించాయి. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్​ వెలుపల తొలి యోగా విశ్వవిద్యాలయాన్ని అమెరికాలోని లాస్​ ఏంజిల్స్​లో మంగళవారం ప్రారంభించారు. దీనికి ప్రముఖ భారతీయ యోగా గురువు డాక్టర్​ హెచ్​ఆర్​ నాగేంద్ర తొలి ఛైర్మన్​గా నియమితులయ్యారు.

Vivekananda Yoga University' launched in US
భారత్​ వెలుపల తొలి యోగా విశ్వవిద్యాలయం ప్రారంభం
author img

By

Published : Jun 24, 2020, 9:36 AM IST

ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్​ వెలుపల ప్రపంచంలోనే తొలి యోగా విశ్వవిద్యాలయం 'వివేకానంద యోగా యూనివర్సిటీ (వీఏవైయూ)' అమెరికాలోని లాస్​ఏంజిల్స్​లో ప్రారంభమైంది. ప్రాచీన భారతీయ యోగా అభ్యాసానికి శాస్త్రీయ సూత్రాలు, ఆధునిక పరిశోధన విధానాలను సమ్మిళితంగా అందించనుంది ఈ విశ్వవిద్యాలయం.

న్యూయార్క్​లోని కాన్సులేట్​ జనరల్​ ఆఫ్​​ ఇండియాలో వర్చువల్​గా జరిగిన కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​, విదేశీ వ్యవహారాలపై ఏర్పాటైన స్థాయీ సంఘం ఛైర్​పర్సన్​ పీపీ చౌదరి కలిసి విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కన్సులేట్​ జనరల్​, అమెరికాలోని జైపూర్​ ఫూట్ ఛైర్​పర్సన్​, వీఏవైయూ వ్యవస్థాపక డైరెక్టర్ ప్రేమ్​ భందారి సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ​​

" భారత సంస్కృతి, వారసత్వానికి చిహ్నమైన యోగా.. ప్రపంచంలో ఐక్యత, సోదరభావానికి సాధనంగా మారింది. యోగా మాధ్యమం ద్వారా ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తున్నాం. యోగా అనేది మానసిక సమతుల్యత, స్థిరత్వాన్ని అందిస్తుంది."

- మురళీధరన్​, విదేశాంగ శాఖ సహాయ మంత్రి.

తొలి ఛైర్మన్​గా భారతీయ యోగా గురువు..

భారత్​ వెలుపల తొలి యోగా విశ్వవిద్యాలయానికి తొలి ఛైర్మన్​గా ప్రముఖ భారతీయ యోగా గురువు, స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్​(ఎస్​వీవైఏఎస్​ఏ) ఛాన్సిలర్​ హెచ్​ఆర్​ నాగేంద్ర నియమితులయ్యారు.

ఇదీ చూడండి: 'భారత్​- చైనా' మధ్య 11 గంటల చర్చ ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.