ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లు దాటిన కరోనా కేసులు - Russia corona updates

ప్రపంచ దేశాలపై కొవిడ్​ వ్యాప్తి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల మార్క్​ను దాటింది. వైరస్​ సోకిన వారిలో 11లక్షల 15వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అటు కొవిడ్​ను జయించిన వారి సంఖ్యా క్రమంగా పెరుగుతూ 3 కోట్లకు చేరువైంది. మరో 89.82 లక్షల యాక్టివ్​ కేసులున్నాయి.

WORLD WIDE COVID-19 CASES CROSSED THE 4 CRORES MARK
ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Oct 18, 2020, 7:27 PM IST

ప్రపంచంపై కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకు లక్షల చొప్పున కొత్త కేసులు నమోదవుతుండగా.. మొత్తం బాధితుల సంఖ్య 4 కోట్లకు ఎగబాకింది.

వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు థాయ్​లాండ్..​ మయన్మార్​ సరిహద్దులను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. సరిహద్దు నగరమైన మే సాట్​లో ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఐదుగురికి పాజిటివ్​గా తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది థాయ్​ ప్రభుత్వం​. ఆ దేశంలో మొత్తం 3,686 కేసులు వెలుగు చూడగా.. 59 మంది వైరస్​కు బలయ్యారు.

ఇంగ్లాండ్​లో ఇప్పటివరకు 7.05 లక్షల మంది కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 43వేల 579 మంది చనిపోయారు.

  • కొవిడ్​ కేసుల పరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 83.43 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. 2.24 లక్షల మంది మరణించారు.
  • రష్యాలో వైరస్​ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. మరో 15,099 కేసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 14లక్షలకు సమీపించింది. 185 కొత్త మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 24,187కు పెరిగింది.
  • మెక్సికోలో మరో 5,447 కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 8.47 లక్షలు దాటింది. వైరస్​ ధాటికి మరో 355 మంది బలవ్వగా.. మరణాల సంఖ్య 86వేలు దాటింది.
  • బంగ్లాదేశ్​లో ఒక్కరోజులో 1,274 మందికి కరోనా నిర్ధరణ అయింది. కేసుల సంఖ్య 3లక్షల 88వేలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 5,660 కొవిడ్​​ మరణాలు నమోదయ్యాయి.
  • పాక్​లో కొత్తగా 567 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. బాధితుల సంఖ్య 3.23 లక్షలకు పెరిగింది. వైరస్​ కారణంగా మొత్తం 6,654 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • సింగపూర్​లో మొత్తం కేసుల సంఖ్య 57,911కి చేరగా.. 28 మరణాలు సంభవించాయి.

ఇదీ చదవండి: న్యూయార్క్​లో థియేటర్స్ రీఓపెన్- షోకు 50 మందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.