ETV Bharat / international

'కరోనా టీకా ముందు వారికే అందించాలి' - కరోనా టీకా మొదట ఎవరికి

కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చాక మొదట ఎవరికి ఇస్తారు? ప్రస్తుతం అందరికీ తలెత్తే ప్రశ్న ఇది. అయితే కరోనాపై పోరులో ముందుండి నడుస్తున్న వైద్య సిబ్బందికే మొదటగా టీకాను అందిచాలని సర్గో ఫౌండేషన్​ ప్రతినిధి సెమా స్గెయిర్​ ​ తెలిపారు. అమెరికా వైద్య నిపుణులతోపాటు ప్రపంచ శాస్త్రవేత్తలు సైతం ఇదే సూచిస్తున్నట్లు వివరించారు.

Who will be the first to get COVID-19 vaccines?
'కరోనా టీకా ముందు వారికే అందించాలి'
author img

By

Published : Nov 17, 2020, 4:25 PM IST

కరోనాపై పోరులో ముందుండి నడుస్తున్న వైద్య సిబ్బందికే కొవిడ్​-19టీకాను ఇవ్వడంలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రముఖ ఎన్​జీఓ సంస్థ సర్గో ఫౌండేషన్​ అధికారి సెమా స్గెయిర్​ తెలిపారు. 'అమెరికాకు చెందిన నిపుణుల బృందం సైతం మొదట అత్యవసర విభాగాల్లో సేవలందిస్తున్న వారికి తరువాత.. వయోజనులకు టీకాను అందివ్వాలని సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​(సీడీసీ)కు సూచనలు చేశారు. ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల'ని సెమా​ అన్నారు.

సీడీసీ తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్రాలు అమలు చేస్తాయని చెప్పుకొచ్చారు సెమా స్గెయిర్. వ్యాక్సిన్​ను సరైన వ్యక్తులకు అందిస్తే కరోనా వ్యాప్తిని మరింత కట్టడి చేయవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా టీకా అందిస్తారా? లేక వైరస్​ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇస్తారా?అనేది తెలియాల్సిఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.