ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి సభ్యత్వాన్ని ఉపసంహరించుకోవడంపై పునారాలోచించుకోవాని కోరారు డబ్ల్యూహెచ్ఓ ఛీఫ్ టెడ్రోస్ అథనోమ్. చీలిపోయిన ప్రపంచంలో వైరస్ ను అంతం చేయడం కష్టమని నొక్కి చెప్పారు. సంస్థకు ఏటా 450 మిలియన్ డాలర్లు సహాయనిధినిచ్చే అమెరికా ఇప్పుడు వైదొలగడం బాధాకరమన్నారు. గతంలో అగ్రరాజ్యం ప్రపంచ ఆరోగ్య పథకాలకు సహకరించిన తీరు అందరికీ తెలిసిందేనన్నారు.
"ఉపసంహరణపై అమెరికా మరోసారి ఆలోచించుకోవాలి. ఇథియోపియాలో నేను మంత్రి పదవిలో ఉన్నప్పుడు హెచ్ఐవీ/ఎయిడ్స్ ఆఫ్రికాను పట్టి పీడించింది. అప్పుడు అమెరికా దాతృత్వం, నాయకత్వమే ఆనాడు ఆఫ్రికా ప్రజలు, కుటుంబాలకు భరోసానిచ్చింది. "
-టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ ఛీఫ్
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో డబ్ల్యూహెచ్‌ఓ స్పందన బాగా లేదని పలుమార్లు ఆరోపించారు. మహమ్మారి వ్యాప్తి పరిధిని కప్పిపుచ్చడానికి చైనాతో ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు. అయితే డబ్ల్యూహెచ్ఓ ఆ వాదనలను ఖండించింది.
ఇదీ చదవండి: కష్టనష్టాల కలనేత- నేడు జాతీయ చేనేత దినోత్సవం