ETV Bharat / international

జార్జియా నుంచి సెనెట్​కు తొలి నల్లజాతీయుడు

అమెరికాలో రిపబ్లికన్​​ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జార్జియాలో ఒక స్థానంలో రాఫెల్‌ వార్నోక్‌ విజయం సాధించి.. ఈ రాష్ట్రం నుంచి సెనెట్‌కు వెళ్లిన తొలి నల్లజాతీయుడిగా చరిత్ర సృష్టించారు. దీంతో సెనెట్​లో డెమొక్రాట్ల బలం 49కి పెరిగింది. మరో స్థానంలోనూ డెమొక్రాట్​ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

Warnock makes history with Senate win as Dems near majority
జార్జియా నుంచి తొలి నల్లజాతీయ సెనెట్​గా వార్నోక్​
author img

By

Published : Jan 6, 2021, 7:10 PM IST

Updated : Jan 7, 2021, 1:40 PM IST

అమెరికాలోని జార్జియాలో రిపబ్లికన్‌ పార్టీకి మరోసారి భంగపాటు ఎదురైంది. ఇక్కడి రెండు సెనెట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. ఇప్పటికే ఒక స్థానంలో డెమొక్రాట్‌ అభ్యర్థి రాఫెల్‌ వార్నోక్‌ విజయం సాధించగా.. మరో స్థానంలోనూ డెమొక్రాట్‌ అభ్యర్థి జాన్‌ ఓసోఫ్‌ ముందంజలో ఉన్నారు.

మరో అభ్యర్థి గెలిస్తే సమానం..

అమెరికా కాంగ్రెస్‌లోని సెనెట్‌లో ఆధిపత్యాన్ని నిర్దేశించే ఎన్నికలు కావడంతో జార్జియా పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 100 మంది సభ్యులున్న సెనెట్‌లో ప్రస్తుతం రిపబ్లికన్లకు 50, డెమొక్రాట్లకు 48 స్థానాలున్నాయి. తాజాగా రాఫెల్‌ వార్నోక్‌ విజయం సాధించడం వల్ల డెమొక్రాట్ల బలం 49కి పెరిగింది. జాన్‌ ఓసోఫ్‌ కూడా గెలిస్తే రెండు పార్టీల బలం సమానవుతుంది. టై పరిస్థితి ఎదురైనప్పుడు కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సెనెట్‌ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఒక ఓటును డెమొక్రాట్లకు వేయవచ్చు. దీంతో సెనెట్‌తో పాటు పూర్తి కాంగ్రెస్‌లో బైడెన్‌కు ఆధిపత్యం లభిస్తుంది. ఇప్పటికే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు మెజార్టీ బలం ఉంది.

తొలి నల్లజాతీయుడు..

నిజానికి జార్జియా సెనెట్‌ స్థానాలకు అధ్యక్ష ఎన్నికలతో పాటే గతేడాది నవంబరులోనే ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు ఫలితం తేలకపోవడం వల్ల తాజాగా మరోసారి ఎన్నికలు నిర్వహించారు. ఒక స్థానంలో రాఫెల్‌ వార్నోక్‌ విజయం సాధించి ఈ రాష్ట్రం నుంచి సెనెట్‌కు వెళ్లిన తొలి నల్లజాతీయుడిగా చరిత్ర సృష్టించారు. జార్జియాలో రిపబ్లికన్లకు మంచి బలం ఉండేది. 1992 నుంచి ఇక్కడ రిపబ్లికన్‌ అభ్యర్థులదే విజయం. అయితే 2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ ఇక్కడ విజయం సాధించి.. 28 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఆధిక్యం సాధించిన తొలి డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థిగా రికార్డు సాధించారు. ఇప్పుడు సెనెట్‌ ఎన్నికల్లోనూ బైడెన్‌ పార్టీనే ఆధిక్యం ప్రదర్శించింది.

జార్జియాలో ఇప్పటికీ ఓటమిని అంగీకరించని ట్రంప్‌.. అక్కడ ఎన్నికల ఫలితాన్ని మార్చాలంటూ ఇటీవల ఆ రాష్ట్ర కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. బైడెన్‌ గెలుపు ధ్రువీకరించే కాంగ్రెస్‌ సంయుక్త సమావేశానికి ముందు ట్రంప్‌ ఈ ప్రయత్నాలు చేయడం గమనార్హం. జో బైడెన్‌ను అనుకూలంగా ఎలక్టోరల్‌ కాలేజీ వేసిన ఓటును ధ్రువీకరించేందుకు కాంగ్రెస్‌ సంయుక్త సమావేశం బుధవారం జరగనుంది.

ఇదీ చూడండి: క్లైమాక్స్​కు 'అధ్యక్ష పోరు'- ట్రంప్​ ట్విస్ట్ ఇస్తారా?

Last Updated : Jan 7, 2021, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.