ETV Bharat / international

వీసాల నిలిపివేతపై వర్తక సంఘాల న్యాయపోరాటం - యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ వర్తక సంఘాలు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. ఈ నిబంధనలు ఆర్థిక వృద్ధిని నిరోధిస్తాయని వ్యాజ్యంలో స్పష్టం చేశాయి.

US trade bodies file lawsuit against proclamation suspending new non-immigrant visas
వీసాల నిలిపివేతపై కోర్టుకెక్కిన అమెరికా వర్తక సంఘాలు
author img

By

Published : Jul 23, 2020, 2:11 PM IST

హెచ్​1బీ సహా నాన్​ ఇమ్మిగ్రేషన్ వీసాలను నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమెరికాకు చెందిన ఐదు వర్తక సంఘాలు కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాయి. నాన్​ ఇమ్మిగ్రెంట్ ఉద్యోగులకు వీసాలు నిరాకరించడం వల్ల అమెరికా వ్యాపారులకు ప్రతిభావంతుల కొరత ఏర్పడుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నాయి. ప్రతిభావంతుల కోసం పోటీ పడుతున్న ప్రస్తుత మార్కెట్​లో ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదించాయి.

యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్​, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫాక్చర్స్​, నేషనల్ రిటైల్​ ఫెడరేషన్, టెక్​నెట్​, ఇంట్రాక్స్​ అనే వర్తక సంఘాలు సంయుక్తంగా ఈ లా సూట్ దాఖలు చేశాయి.

రద్దు చేయాలి

చట్టవిరుద్ధంగా ఉన్న ఈ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ నిబంధనలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని అన్నారు.

"అమెరికన్ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో సహాయపడే ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, వైద్యులు, నర్సులు ఇతర కార్మికులకు ఇది 'స్వాగతించని' సంకేతం. ఈ నిబంధనలు పెట్టుబడులను విదేశాలకు నెట్టివేస్తాయి, ఆర్థిక వృద్ధిని నిరోధిస్తాయి, ఉద్యోగ కల్పనను తగ్గిస్తాయి."

-థామస్ డొనోహూ, యూఎస్​ ఛాంబర్ ఆఫ్ కామర్స్​ సీఈఓ

ఇది పరిష్కారం కాదు

ఈ నిర్ణయం వల్ల ప్రభావితమైన హెచ్​1బీ వీసాలు అమెరికాలోని సంస్థలకు చాలా కీలకమని వ్యాజ్యంలో పేర్కొన్నారు. వీటిని నిలిపివేయడం ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాదని అభిప్రాయపడింది. ఈ ఉద్యోగులను నియమించుకోలేకపోతే పరిశ్రమలోని వ్యాపారాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపింది.

'కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది'

చట్టవిరుద్ధమైన ఈ నిబంధన భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను నిరోధిస్తుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫాక్చరర్స్​ సీనియర్ వైస్​ ప్రెసిడెంట్​ లిండా కెల్లీ పేర్కొన్నారు.

"తయారీదారులు, ప్రోగ్రామ్ స్పాన్సర్లు కోర్టులకు వెళ్తున్నారు. ఎందుకంటే చట్టం హద్దులు మీరే విధంగా ఈ నిబంధనలు ఉన్నాయి. ఇది పరిశ్రమకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ఇలా జరగడాన్ని మేం అనుమతించలేం. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై పరిశ్రమ దృష్టిసారించాల్సింది. ఈ వీసా నిబంధనల వల్ల ప్రతిభావంతులు అమెరికాను విడిచి వెళ్తారు. కాబట్టి ఇతర దేశాలకు ప్రయోజనం కలుగుతుంది."

-లిండా కెల్లీ, అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫాక్చరర్స్​ సీనియర్ వైస్ ప్రెసిడెంట్

ఇదీ చదవండి- 'అయోధ్య భూమిపూజకు ఆ నిందితుల్ని ఆహ్వానించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.