ETV Bharat / international

Omicron Cases: అక్కడ కొత్త కరోనా కేసుల్లో ఒమిక్రాన్​వే 60 శాతం!

US Omicron Cases: అమెరికాలో ఒమిక్రాన్​ వ్యాప్తి తీవ్రంగా ఉంది. గతవారంలో నమోదైన కొత్త కేసుల్లో 59 శాతం ఒమిక్రాన్​ వేరియంట్​కు చెందినవే అని అధికారులు వెల్లడించారు. మరోవైపు స్పెయిన్​లో కూడా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలను కట్టుదిట్టం చేసింది అక్కడి ప్రభుత్వం.

omicron
అక్కడ వారంలో 59 శాతం ఒమిక్రాన్​ కేసులే!
author img

By

Published : Dec 29, 2021, 7:45 AM IST

US Omicron Cases: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించే స్థాయిలో ఒమిక్రాన్​ వేరియంట్​ వ్యాపిస్తోంది. అగ్రరాజ్యం కూడా అందుకు మినహాయింపు కాదు. అమెరికాలో గత వారం నమోదైన కొవిడ్​ కేసుల్లో 59 శాతం ఒమిక్రాన్​ బాధితులే ఉన్నారు. అంతకుముందు వారంలో ఇది 23 శాతంగా ఉండేది. ఈ విషయాన్ని సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​-సీడీసీ మంగళవారం వెల్లడించింది.

అయితే ఇదివరకుతో పోలిస్తే ఈ అంచనాను తగ్గించినట్లు సీడీసీ పేర్కొంది. కానీ ఒమిక్రాన్​ తీవ్రత కొనసాగుతోందని స్పష్టం చేసింది.

California records more than 5 million cases

  • అమెరికా కాలిఫోర్నియాలో ఇప్పటివరకు 50 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇన్ని కేసులు వచ్చిన తొలి రాష్ట్రంగా అవతరించింది. ఒక్క కాలిఫోర్నియాలోనే 75 వేల 500 మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు.
  • 2020 జనవరి 25న అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. నవంబర్​ 11 నాటికి అంటే 292 రోజుల్లో మిలియన్​ మార్కుకు చేరింది.
  • గత వారంలో చూసుకుంటే.. ప్రతి లక్ష మందిలో సగటున 16 మందికి వైరస్​ సోకింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
  • చైనాలో తొలి కరోనా కేసు వెలుగుచూసిన రోజుల్లో అమెరికాలోని కాలిఫోర్నియా కూడా ఎక్కువ ప్రభావితమైంది.
  • 2020 మార్చిలోనే ఆంక్షలు విధించారు స్థానిక గవర్నర్​. స్టే ఎట్​ హోం ఆర్డర్​ జారీ చేశారు. వ్యాపారాలు మూసివేశారు. అయినా కరోనా వైరస్​ చాపకింద నీరులా విస్తరించింది.

టెక్సాస్​లో 44 లక్షలు, ఫ్లోరిడాలో 39 లక్షల మంది కరోనా బారినపడ్డారు.

స్పెయిన్​లో తీవ్రం..

ఐరోపా దేశాల్లో కూడా ఒమిక్రాన్​ శరవేగంగా వ్యాపిస్తోంది. స్పెయిన్​లో ఒమిక్రాన్​ వ్యాప్తి తారస్థాయికి చేరుకుంది. దేశంలో సోమవారం.. కొత్తగా 214,619 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈనెల 23 నుంచి ఇప్పటివరకు 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆంక్షలను కట్టుదిట్టం చేసింది అక్కడి ప్రభుత్వం. నవార్రా, ఆరగాన్​, కెంటాబ్రియా సహా పలు ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూను మొదలైన ఆంక్షలను అమలు చేసింది.

ఇండోనేసియాలో..

ఒమిక్రాన్​ వ్యాప్తి తీవ్రం అవుతున్న ఇండోనేసియాలో తొలిసారిగా స్థానికులలో వైరస్​ను గుర్తించారు అధికారులు. విదేశీ ప్రయాణాలు, విదేశీయులతో ఎలాంటి సంబంధంలేని ఓ 37 ఏళ్ల వ్యక్తిలో ఒమిక్రాన్​ను గుర్తించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 26న ఆ వ్యక్తికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయిందని పేర్కొంది. దీంతో ఇండోనేసియాలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 47కు చేరింది.

ఇదీ చూడండి : కార్లలో కరోనా పరీక్షలకు.. ఆస్పత్రుల వద్ద భారీ క్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.