ETV Bharat / international

'అత్యధిక కాలుష్యం ఈ నాలుగు దేశాల నుంచే'

కర్బన ఉద్గారాలను కట్టడి చేయడానికి భారత్​ సహా పెద్ద దేశాలన్నీ చర్యలు తీసుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఐరోపా సమాఖ్య, అమెరికా, చైనా, భారత్​ వంటి దేశాలు అధికంగా వాయు ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 2019లో కర్బన ఉద్గారాలు అత్యధిక స్థాయిలో వెలువడ్డాయని.. పారిస్ ఒప్పందంలోని హామీలను చాలా దేశాలు నిలబెట్టుకోలేకపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

US, EU, China, India among 'big emitters', must lead way on climate action: UN chief
'ఆ నాలుగు దేశాల నుంచే అధిక వాయు ఉద్గారాలు'
author img

By

Published : Feb 6, 2020, 6:14 AM IST

Updated : Feb 29, 2020, 8:53 AM IST

అత్యధికంగా కాలుష్యం చేస్తోంది ఈ నాలుగు దేశాలే

భూతాపానికి కారణమవుతున్న గ్రీన్​హౌజ్ వాయువులను తగ్గించాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. ఐరోపా సమాఖ్య, అమెరికా, చైనా, భారత్ వంటి పెద్ద దేశాలు అత్యధికంగా కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని తెలిపింది.

ఆయా దేశాలన్నీ వాయు ఉద్గారాలను అదుపులో ఉంచేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్​. లేనట్లయితే అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలన్నీ అణిచివేసినట్లవుతుందని పేర్కొన్నారు.

"2019లో అన్ని ప్రాంతాల్లో అత్యధికంగా ఉద్గారాలు వెలువడ్డాయి. కాలుష్యాన్ని అదుపు చేయడానికి పారిస్ ఒప్పందంలోని హామీలను చాలా దేశాలు నిలబెట్టుకోలేకపోయాయి. కార్బన్ న్యూట్రాలిటీకి కట్టుబడి ఉంటామని 70 దేశాలు కలిసి తీసుకున్న నిర్ణయానికి పెద్ద దేశాలు సహా అందరూ కట్టుబడి ఉంటారా అన్నది ప్రస్తుత ప్రశ్న. బిగ్​ ఎమిటర్స్​ అంటే ఎవరో మనకు సుపరిచితమే. ఐరోపా సమాఖ్య ఈ నియమాలకు కట్టుబడి ఉంది. అమెరికా, చైనా, భారత్, జపాన్, రష్యా కూడా దీనికి కట్టుబడటం చాలా ముఖ్యం."
- ఆంటోనియా గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి

80 శాతంగా..జీ20 దేశాల వాటా

2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధిస్తే.. ఈ శతాబ్దం చివరినాటికి భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్​కు తగ్గించేందుకు దోహదపడుతుందని గుటెరస్ పేర్కొన్నారు. మొత్తం ఉద్గారాలలో జీ20 దేశాల వాటా 80 శాతంగా ఉందని చెప్పారు. కర్బన ఉద్గారాలు రికార్డు స్థాయిలోకి చేరుతున్నందున కట్టడి చేయడానికి ఆర్థిక పరంగా 'బిగ్ ఎమిటర్స్'​ ముందుండాలని పిలుపునిచ్చారు. శిలాజ ఇంధనంపై రాయితీలని తొలగించండం 2020 సంవత్సరానికి తమ ప్రాధాన్యాలుగా వివరించారు గుటెరస్.

అగ్రస్థానంలో చైనా​

ప్రపంచంలో చైనా అత్యధికంగా కర్బన ఉద్గారాలు విడుదల చేస్తుండగా... అమెరికా, భారత్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గ్రీన్​హౌజ్​ వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్నప్పటికీ అమెరికా... పారిస్ ఒప్పందం నుంచి వైదొలగింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి.

మరోవైపు వాతావరణ మార్పులపై పోరాడటానికి భారత్ మందుంటుందని గతేడాది సెప్టెంబర్​లో నిర్వహించిన ఐరాస వాతావరణ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శిలాజ రహిత ఇంధన ఉపయోగాన్ని రెట్టింపు చేయనున్నట్లు సంకల్పించారు.

ఇదీ చదవండి: సెనేట్​లో వీగిపోయిన అభిశంసన.. నిర్దోషిగా ట్రంప్

Intro:Body:Conclusion:
Last Updated : Feb 29, 2020, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.