ETV Bharat / international

అమెరికా, చైనా దేశాధ్యక్షుల వర్చువల్​ భేటీ.. ఎప్పుడంటే? - us-china trade war latest news

అమెరికా, చైనా దేశాధ్యక్షులు త్వరలో వర్చువల్​గా సమావేశం కానున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ సమావేశం ఉంటుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్​ సులివాన్ తెలిపారు.

US, China
అమెరికా, చైనా
author img

By

Published : Oct 7, 2021, 5:23 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden News), చైనా అధ్యక్షుడు జిన్​పింగ్(xi jinping news) త్వరలో వర్చువల్​గా సమావేశం కానున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షభవనం శ్వేతసౌథం తెలిపింది. ఈ ఏడాది చివరిలోనే సమావేశం జరిగే అవకాశం ఉందని పేర్కొంది.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్​ సులివాన్​తో చైనా విదేశాంగ మంత్రి మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్​ సులివాన్​తో చైనా విదేశాంగ మంత్రి మధ్య సమావేశం దాదాపు 6గంటలపాటు జరిగింది. తన చర్యలతో చైనా ఆందోళన కలిస్తున్న పలు అంశాలను సులివన్ ఈ సమావేశంలో లేవనెత్తారు. మానవహక్కులు, జిన్​జియాంగ్, హాంగ్​కాంగ్​, దక్షిణచైనా సముద్రం, తైవాన్.. తదితర అంశాలపై ఇరు దేశాల నాయకులు చర్చలు జరిపారు.

బిజీ షెడ్యూల్​ కారణంగా వచ్చే ఏడాది నుంచి ఇరు దేశాధ్యక్షులు కలిసి సమావేశంలో పాల్గొనకపోవచ్చని.. అందుకే ఈ ఏడాది చివరి వరకు వర్చువల్​ మీటింగ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: పాకిస్థాన్​ ఐఎస్​ఐ చీఫ్​ బదిలీ.. అదే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.