ETV Bharat / international

డొనాల్డ్​ ట్రంప్​కు కరోనా వైరస్​ నెగటివ్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఫలితం నెగిటివ్​గా వచ్చింది. వారం రోజుల క్రితం మార్-ఎ-లాగోలో బ్రెజిలియన్ ప్రతినిధి బృందంలో కలిసి ట్రంప్ విందులో పాల్గొన్నారు. ఆ బృందంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తరువాత తేలింది. దీనితో ట్రంప్​ కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఒత్తిడి వచ్చింది.

Trump tests negative for coronavirus
డొనాల్డ్​ ట్రంప్​కు కరోనా వైరస్​ నెగటివ్​
author img

By

Published : Mar 15, 2020, 7:32 AM IST

ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను మాత్రం దరిచేరలేకపోయింది. ట్రంప్ శుక్రవారం రాత్రి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 24 గంటల తరువాత ఫలితం నెగిటివ్​గా వచ్చిందని శ్వేతసౌధం తెలిపింది.

"శుక్రవారం రాత్రి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్రంప్​తో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. చివరికి ఆయన కరోనా టెస్ట్​కు అంగీకరించారు. పరీక్షల్లో ఆయనకు కరోనా సోకలేదని డాక్టర్ సీన్​ కొన్లీ స్పష్టం చేశారు."- స్టెఫానీ గ్రిషామ్​, శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ

వారం రోజుల క్రితం మార్-ఎ-లాగోలో బ్రెజిలియన్ ప్రతినిధి బృందంలో కలిసి ట్రంప్ విందులో పాల్గొన్నారు. ఆ బృందంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా తరువాత తేలింది. దీనితో ట్రంప్​ కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని ఒత్తిడి వచ్చింది.

ఇదీ చూడండి: డిసెంబర్ త్రైమాసికంలో ఎస్​ బ్యాంకు నష్టం రూ.18,564 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.