ETV Bharat / international

'మోదీ బొమ్మ'కు కోటి వ్యూస్​- ట్రంప్​ అస్త్రం హిట్​ - అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​

అధ్యక్ష ఎన్నికల్లో ఇండో-అమెరికన్ల మనసు దోచుకునేందుకు డొనాల్డ్​ ట్రంప్​ బృందం ప్రవేశపెట్టిన 'మోదీ' అస్త్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. మోదీ బొమ్మ ఉన్న వీడియోను ప్రచార చిత్రంగా గత నెలలో విడుదల చేయగా.. తాజాగా దానికి కోటి వ్యూస్​ వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోను ప్రజలు విపరీతంగా చూసేశారు.

Trump campaign video aimed at Indian American voters hits 10 million views
'మోదీ బొమ్మ'కు కోటి వ్యూస్​.. ట్రంప్​ అస్త్రం హిట్​
author img

By

Published : Sep 16, 2020, 11:14 AM IST

రానున్న అధ్యక్ష ఎన్నికల కోసం 'మోదీ బొమ్మ'తో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రానికి విశేష అదరణ లభిస్తోంది. ఇండో-అమెరికన్ల ఓట్లను గెలుచుకునేందుకు ప్రయోగించిన ఈ అస్త్రం.. ఏకంగా కోటి వ్యూస్​ను సంపాదించుకుంది. విడుదల చేసి నెల రోజులు కూడా కాకుండా ఈ స్థాయిలో వ్యూస్​ దక్కడం విశేషం.

ఈ ప్రచార చిత్రాన్ని.. ఒక్క ట్విట్టర్​లోనే 3లక్షలకుపైగా మంది వీక్షించినట్టు వీడియో రూపకర్త, ట్రంప్​ మద్దతుదారుడు అల్​ మేసన్​ తెలిపారు. ఫేస్​బుక్​, ట్విట్టర్​, వాట్సాప్​లో అంతకు మించి వ్యూస్​ వచ్చినట్టు వివరించారు. ట్రంప్​ మరో నాలుగేళ్లు పాలిస్తే.. భారత్​-అమెరికా మైత్రి మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:- అమెరికాలో ఎన్నికల వేడి- సంక్లిష్టంగా పోలింగ్ ప్రక్రియ

వీడియోలో ఏముందంటే...

  • America enjoys a great relationship with India and our campaign enjoys great support from Indian Americans! 👍🏻🇺🇸 pic.twitter.com/bkjh6HODev

    — Kimberly Guilfoyle (@kimguilfoyle) August 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఫోర్​ మోర్​ ఇయర్స్​" పేరిట విడుదలైన 107 సెకన్ల ట్రంప్​ ప్రచార వీడియోలో.. మోదీ కనిపించారు. గతేడాది మోదీ.. అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో హ్యూస్టన్​లోని ఎన్​ఆర్​జీ స్టేడియంలో 'హౌడీ మోడీ' పేరిట భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ చారిత్రక కార్యక్రమంలో దాదాపు 55 వేల మందికి పైగా ఇండో-అమెరికన్లు హాజరయ్యారు. అయితే ఆ వేదికపై మోదీ-ట్రంప్​ చేయి పట్టుకొని తీసుకున్న ఫొటో, ప్రసంగం సన్నివేశాలను తాజాగా తమ వీడియోలో పెట్టింది ట్రంప్​ ప్రచార బృందం.

ఆ సభలో ప్రసంగించిన మోదీ.. ట్రంప్​ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేర్కొన్నారు. దాదాపు అన్ని దేశాల చర్చల్లో ఆయన పేరు ప్రస్తావనకు వస్తుందని కితాబిచ్చారు. ఆ బైట్​ను ప్రచార వీడియోలో పెట్టింది ట్రంప్​ బృందం.

ఇదీ చూడండి:- అమెరికా ఎన్నికలపై ఆ దేశాల హ్యాకర్ల దాడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.