అమెరికా నార్త్ కరోలీనాలో కాల్పుల కలకలం రేగింది. విల్మింగ్టన్ నగరంలో ఓ హౌస్ పార్టీ జరుగుతుండగా.. సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పారు.
"ఓ ఇంట్లో హౌస్ పార్టీ జరుగుతోంది. అప్పుడు ఇంట్లో ఏడుగురు ఉన్నారు. ముగ్గురు మరణించగా.. నలుగురు గాయపడ్డారు."
-డానీ విలియమ్స్, పోలీస్ చీఫ్
ఈ ఘటనలో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విలియమ్స్ స్పష్టం చేశారు. కాల్పులకు గల కారణాలను వెతికే పనిలో పడ్డారు పోలీసులు.
ఇదీ చదవండి: