ETV Bharat / international

ఈ పెయింట్​తో మీ కరెంట్​ బిల్లు ఆదా.. వాతావరణం సేఫ్​! - భూతాపం

ఏసీలు, హీటర్లు, ఫ్రిడ్జ్​లు వంటి పరికరాలు విడుదల చేస్తున్న గ్రీన్​హౌస్​ ఉద్గారాలతో పుడమి వేడెక్కుతోంది. ఇది ప్రపంచంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోంది. ఈ తరుణంలో ఆయా పరికరాల వినియోగాన్ని తగ్గిస్తూనే, వాటికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు అమెరికా పర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే 'అత్యంత తెల్లని పెయింట్​'తో వాతావరణ సంక్షోభంపై పోరాటం చేయవచ్చని అంటున్నారు.

The Whitest Pain
ప్రపంచంలోనే అత్యంత తెల్లని పెయింట్​
author img

By

Published : Sep 23, 2021, 1:12 PM IST

అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు.. ప్రపంచంలోనే అత్యంత తెల్లని పెయింట్​ను సృష్టించారు. ఇది వాతావరణ సంక్షోభంపై పోరాటానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.

ఈ పెయింట్​ను వర్సిటీలోని మెకానికల్​ ఇంజినీరింగ్​ ప్రొఫెసర్​ జులిన్​ రువాన్​, కొందరు విద్యార్థులు సృష్టించారు. 'రేడియేటివ్​ కూలింగ్​' పద్ధతితో ఈ పెయింట్​ పనిచేస్తుంది. ఇందులోని 'పాసివ్​ కూలింగ్' సాంకేతికత.. భూతాపాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

The Whitest Pain
పెయింట్​తో రువాన్​

ఏడేళ్ల ముందు ఈ ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు.. వాతావరణ మార్పులపై దృష్టిసారించాలని నిర్ణయించుకున్నట్టు రువాన్​ తెలిపారు. సూర్యరశ్మి భవనాలను తాకినప్పుడు, లోపలకు వేడి చేరకుండా.. బయటకే అది ప్రతిబింబించే విధంగా పెయింట్​ను సృష్టించాలని అనుకున్నట్టు వెల్లడించారు. దీని వల్ల భవనంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, తద్వారా ఏసీల వినియోగం తగ్గుతుందన్నారు.

"తెల్ల పెయింట్​.. ఇన్​ఫ్రారెడ్​ హీట్​ను విడుదల చేస్తుంది. అందువల్ల సోలార్​ రేడియేషన్​ను 98.1శాతం ప్రతిబింబిస్తుంది. ఫొటో పేపర్​, కాస్మొటిక్స్​లో ఉపయోగించే బేరియం సల్ఫేట్​తో దీనిని రూపొందించాం. సాధారణ తెల్ల పెయింట్​.. బయటి ఉష్ణోగ్రతలతో వెంటనే వేడెక్కుతుంది. కానీ ఈ పెయింట్​కు వేడిని గ్రహించే శక్తి ఉండటం వల్ల చుట్టుపక్కన కన్నా ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. 1,000 చదరపు అడుగుల్లో 10కిలోవాట్ల కూలింగ్​ శక్తిని ఇది ఉత్పత్తి చేస్తుంది. అంటే ఏసీల కన్నా ఇది ఎంతో శక్తిమంతమైనది."

-- రువాన్​, పర్డ్యూ వర్సిటీ ప్రొఫెసర్​.

ఇంట్లో ఏసీ వంటి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే.. వాతావరణానికి మేలు చేకూరుతుంది. ఈ పెయింట్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు వర్సిటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఓ కంపెనీతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతోంది.

The Whitest Pain
ప్రపంచంలోనే అత్యంత తెల్లని పెయింట్​

ఇదీ చూడండి:- Global Warming: భూమాతకు జ్వరమొస్తే అన్నీ ఉత్పాతాలే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.