ETV Bharat / international

అమెరికాలో మళ్లీ ఆంక్షలు.. మాస్క్​ తప్పనిసరి! - కరోనా కేసులు

అమెరికాలో కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. రోజుకు లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్​ గవర్నర్లు మాస్క్​లను తప్పనిసరి చేయటం సహా ఇతర ఆంక్షలు విధిస్తున్నారు.

anti-virus restrictions
అమెరికాలో మళ్లీ ఆంక్షలు
author img

By

Published : Nov 18, 2020, 7:37 AM IST

అమెరికాలో కొద్ది రోజులుగా కొవిడ్​ మహమ్మారి పంజా విసురుతోంది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో వైరస్​ కట్టడికి మళ్లీ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చాలా రాష్ట్రాలు, స్థానిక అధికారులు కఠిన నిర్ణయాలకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల రిపబ్లికన్​ గవర్నర్లు మాస్క్​లు తప్పనిసరి చేశారు. పాఠశాలలను తిరిగి తెరిచే ప్రణాళికలను వాయిదా వేస్తున్నారు.

థ్యాంక్స్​గివింగ్​ సెలవు..

మాస్క్​లు ధరించటం, భౌతిక దూరం పాటించటం వెనక ఉన్న శాస్త్రీయ మూలాన్ని ప్రశ్నించే వారికి ఈ చర్యలు నచ్చకపోవచ్చు. కొత్త ఆంక్షలతో భారీగా ఉద్యోగాలు కోల్పోవటం, పౌర స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వారి భయపడుతుండటమే అందుకు కారణం. వచ్చే వారం థ్యాంక్స్​గివింగ్​ హాలిడే వస్తున్న క్రమంలో భారీగా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ప్రజారోగ్య అధికారులు పేర్కొంటున్నారు. చాలా తక్కువ మందితో థ్యాంక్స్​గివింగ్​ను నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.

భారీ పెరుగుదల..

కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలించటం లేదు. కొద్ది రోజులుగా వైరస్​ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారు, మరణాలు, కేసుల సంఖ్య ఆకాశాన్నంటుతోంది. సోమవారం ఒక్కరోజే 73 వేల మంది ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కొవిడ్​ ట్రాకింగ్​ ప్రాజెక్ట్​ నివేదిక ప్రకారం సోమవారం 1,66,000పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే రోజువారీ సగటు కేసుల సంఖ్య రెండింతలు పెరిగినట్లు జాన్ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం తెలిపింది. రెండు వారాల క్రితం రోజు వారి సగటు మరణాలు 828గా ఉండగా.. అది 1,145కు చేరింది.

మాస్క్​లు తప్పనిసరి..

అయోవా, నార్త్​ డకోటా, ఉటా, ఇల్లినాయిస్​, మిన్నెసోటా వంటి రాష్ట్రాల​ గవర్నర్లు తమ నిర్ణయాలపై వెనక్కి మళ్లారు. మాస్క్​లు ధరించటం తప్పనిసరి చేయటంతో పాటు ఇతర ఆంక్షలు విధించేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే.. ఉటాలో రాష్ట్రవ్యాప్తంగా మాస్క్​ తప్పనిసరి చేయటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. గవర్నర్​ గ్యారీ హెర్​బెర్ట్​ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దక్షిణ డకోటాలో నవంబర్​లో మరణాల రేటు అత్యధికంగా ఉంది. కానీ, మాస్క్​లపై ఎలాంటి ప్రణాళిక ప్రకటించలేదు.. అక్కడి ప్రభుత్వం.

అయోవా రాష్ట్ర గవర్నర్​ కొద్ది నెలలుగా మాస్క్​ ధరించటం తప్పనిసరికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ.. కేసులు పెరుగుతున్న క్రమంలో మంగళవారం స్వల్ప స్థాయిలో ఆంక్షలకు ఆదేశించారు. మాస్క్​లు వైరస్​ వ్యాప్తిని తగ్గిస్తాయనే అంశంలో శాస్త్రీయత దాగి ఉందని పేర్కొన్నారు.

పాఠశాలల మూసివేత..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికాలో పాఠశాలలను మూసివేస్తున్నారు. కొన్నింటిని త్వరలోనే తెరిచేందుకు చేసిన ప్రణాళికలను వాయిదా వేస్తున్నారు. దక్షిణ డకోటాలో రాపిడ్​ సిటీ ప్రాంత పాఠశాల వ్యవస్థ అన్ని పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. దీనిపై బుధవారం ఆదేశాలు జారీ చేయనుంది. లాస్​ వేగాస్​, పశ్చిమ వర్జీనియా.. వంటి ప్రాంతాల్లో పాఠశాలలు తెరవటాన్ని వాయిదా వేస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా టీకా ముందు వారికే అందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.