ETV Bharat / international

తస్మాత్ జాగ్రత్త: పొగ తాగేవారికి కరోనా గండం! - స్మోకింగ్

దురలవాట్లు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ప్రస్తుతం పొగతాగే అలవాటు, దీర్ఘకాలిక శ్వాసకోశవ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది.

VIRUS-SMOKERS-INFECTION
పొగతాగేవారికి కరోనా గండం!
author img

By

Published : Apr 13, 2020, 5:23 PM IST

పొగతాగే అలవాటు ఉన్నవారు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల (సీఓపీడీ)తో బాధపడేవారిపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. వీరి ఊపిరితిత్తుల్లో ఏసీఈ​-2 ఎంజైమ్​ అధిక స్థాయిలో ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది.

చైనాలోని కరోనా బాధితులపై చేసిన ఈ పరిశోధన.. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్​లో ప్రచురితమైంది. సీఓపీడీతో బాధపడుతున్న 21 మంది, ఈ సమస్య లేని మరో 21 మంది కరోనా బాధితుల శాంపిల్స్​ను సేకరించి పరిశోధన చేశారు. ప్రస్తుతం పొగతాగే వారు, మానేసినవారిపైనా పరిశోధనలు చేశారు. వారి ఊపిరితిత్తులపై ఏసీఈ-2 స్థాయిలను విశ్లేషించారు.

అధిక స్థాయిలో..

ప్రస్తుతం పొగ తాగేవారి ఊపిరితిత్తులపై ఎంజైమ్-II (ఏసీఈ-2)గా మార్చే యాంజియోటెన్సిన్ స్థాయిలు అధికంగా ఉన్నాయని గుర్తించినట్లు బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకుడు జెనిస్ లూంగ్ తెలిపారు.

"సీఓపీడీ కలిగిన వ్యక్తి వాయునాళాల్లో ఏసీఈ-2 స్థాయి అధికంగా ఉన్నట్లు గుర్తించాం. దీని సాయంతో వారి వాయునాళాలకు వైరస్ త్వరగా ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని అంచనాకు వచ్చాం. పొగతాగే అలవాటు ఉన్నవారిలోనూ ఈ ఈ ఎంజైమ్ అధిక స్థాయిలో ఉంది. కొంతమంది మానేసినవారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయి."

- జెనిస్ లూంగ్, పరిశోధకుడు

సిఓపీడీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు పరిశోధకులు. సామాజిక దూరం పాటిస్తూ, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సిఫార్సు చేశారు. పొగతాగే అలవాటు ఉన్నవారు తక్షణం మానేయటం మంచిదని హితవు పలికారు.

ఇదీ చూడండి: ఇక రెండు గాజులూ అమ్ముకోవల్సిన పని లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.