ETV Bharat / international

టీకా కోసం 'సీరం'తో యూనిసెఫ్​ డీల్​

కొవిడ్​ టీకాలను ప్రపంచ దేశాలకు చేరవేసే ప్రక్రియలో భారత్​కు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా భాగమైంది. యూనిసెఫ్​తో కలిసి కొవిషీల్డ్​, నోవావాక్స్​ వ్యాక్సిన్లను వివిధ దేశాలకు పంపిణీ చేయనుంది.

sii and unicef
టీకా పంపిణీలో 'సీరం'తో యూనిసెఫ్​ డీల్​
author img

By

Published : Feb 4, 2021, 4:28 PM IST

ప్రపంచవ్యాప్తంగా అందరికీ కొవిడ్​ టీకా అందించడమే లక్ష్యంగా యూనిసెఫ్(యునైటెడ్​ నేషన్స్​ చిల్డ్రన్స్​ అండ్ ఎమర్జెన్సీ ఫండ్​)​ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​కు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాతో కలిసి ఆక్స్​ఫర్డ్/ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్​ టీకాలను దీర్ఘకాలం పాటు పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో 100 దేశాల్లో 110 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేయగలుగుతామని యూనిసెఫ్​ వెల్లడించింది.

అల్ప, మధ్య ఆదాయ దేశాలకు ఈ టీకాలను సాంకేతికత సాయంతో సరఫరా చేస్తామని యూనిసెఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ హెన్రిట్టా ఫోర్​ తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైన 'కోవాక్స్‌'కు ఈ ఒప్పందం గొప్ప విలువను తెచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ టీకాను భారత్​లోని పుణెకు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఉత్పత్తి చేస్తోంది. నోవావాక్స్​ టీకాను అమెరికా చెందిన నోవావాక్స్​ సంస్థ అభివృద్ధి చేసింది. 145 దేశాల్లోని కరోనా యోధులకు ఈ ఏడాది అర్ధభాగం పూర్తయ్యేనాటికి టీకా అందించాలని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని 'కోవాక్స్'​ నిర్దేశించుకుంది.

ఇదీ చదవండి:'వారికి ఒక్క డోసు కరోనా టీకా చాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.