ETV Bharat / international

ప్రణబ్​ మృతిపట్ల ప్రపంచ దేశాల సంతాపం - ప్రణబ్​ ముఖర్జీ మృతి వార్తలు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించాయి. రాష్ట్రపతిగానే కాకుండా ఇతర పదవుల్లో ఉన్నప్పుడు.. ద్వైపాక్షిక బంధాలను మెరుగుపరుచుకోవడంలో ప్రణబ్​ చేసిన కృషిని ఆయా దేశాలు గుర్తు చేసుకున్నాయి.

World grief over Pranab Mukherjee's demise
ప్రణబ్​ మృతికి ప్రపంచ దేశాల సంతాపం
author img

By

Published : Sep 1, 2020, 5:03 AM IST

Updated : Sep 1, 2020, 6:06 AM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ మృతిపట్ల ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించాయి. ప్రణబ్​ సేవలను గుర్తు చేసుకుంటూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీలకు సంతాప సందేశాన్ని పంపారు.

'రాష్ట్రపతిగా, ఇతర పదవుల్లో ప్రణబ్​ ముఖర్జీ అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకున్నారు. రష్యాకు నిజమైన మిత్రుడిగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారు.' అని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు.

ప్రణబ్​ మరణం పట్ల సంతాపం తెలుపుతూ అమెరికా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

నేపాల్ గొప్ప స్నేహితుడుని కోల్పోయిందని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి అన్నారు. భారత్, నేపాల్ మధ్య సంబంధాల బలోపేతానికి ప్రణబ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ గుర్తుచేసుకుంటామని ఓలి ట్వీట్‌ చేశారు.

  • I am deeply saddened by the news of passing away of former President of India H.E. Pranab Mukherjee. Heartfelt condolences to the government and people of India as well as the bereaved family members. pic.twitter.com/1EpkvIWzvg

    — KP Sharma Oli (@PM_Nepal) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బంగ్లాదేశ్‌ విమోచన కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో ప్రణబ్ ఎనలేని కృషి చేశారని ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్‌ హమీద్‌, ప్రధానమంత్రి షేక్‌ హసినా గుర్తు చేసుకున్నారు.

  • Bangladesh PM Sheikh Hasina writes to PM Narendra Modi,"#PranabMukherjee was a true friend of Bangladesh...In 2013, Govt of Bangladesh conferred on him 'Bangladesh Muktijuddho Sommanona'(Liberation War Honour) for his valuable contribution to Bangladesh's Liberation war of 1971." pic.twitter.com/oFj1XeolMc

    — ANI (@ANI) August 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇజ్రాయెల్‌కు ప్రణబ్‌ నిజమైన మిత్రుడని ఆ దేశాధ్యక్షుడు రెవెన్ రివ్లిన్, ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ అభివర్ణించారు. ప్రణబ్‌ మరణం పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

భారత్‌లోని వివిధ దేశాల దౌత్య వేత్తలు మాజీ రాష్ట్రపతి మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.

ఇవీ చూడండి:

Last Updated : Sep 1, 2020, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.