మెక్సికోలోని గువానాజువాటో రాష్ట్రంలో భద్రతా దళాలకు, దుండగులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది దుండగులు, ఒక పోలీసు అధికారి మృతి చెందారు.
రెండు గ్యాంగ్‌లు శాంట రోసా డి లిమా ప్రాంతంలో సొమవారం తెల్లవారుజామున పరస్పర దాడులకు తెగబడుతున్నాయని మొదట పోలీసులకు సమాచారం అందింది. కాగా ఘటన స్థలానికి చేరుకున్న జాతీయ భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసులపై దుండగులు దాడి చేశారు. వెంటనే భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు.
"జెలిస్కా న్యూ జనరేషన్(సీజేఎన్‌జీ) అనే డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్, శాంట రోసా డి లిమా ప్రాంతానికి చెందిన అదే పేరుతో ఉన్న ముఠాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. భద్రతా దళాలు అక్కడి చేరుకోగా వారిపై ఈ రెండు గ్యాంగులు దాడులకు తెగబడ్డాయి. దాంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేశాయి."
- డేవిడ్ సుసీడో, భద్రతా సిబ్బంది
2017లో సీజేఎన్‌జీ, శాంట గ్యాంగ్‌ల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో వేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: క్యాపిటల్ దాడిలో నేరస్థులు- నిస్సహాయంగా పోలీసులు