ETV Bharat / international

లాక్​డౌన్​లో పిల్లల బర్త్​డే చేస్తున్న అగ్నిమాపక శాఖ

లాక్​డౌన్ విధించడం వల్ల అన్ని రకాల కార్యకలాపాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో పెన్సిల్వేనియా అగ్నిమాపక శాఖ అధికారులు వినూత్నంగా చిన్నారుల పుట్టినరోజు జరుపుతున్నారు. ఈ విపత్కర స్థితిలోనూ ఎన్నో కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారు.

birthday during lockdown
లాక్​డౌన్​లో పిల్లల బర్త్​డే చేస్తున్న అగ్నిమాపక శాఖ
author img

By

Published : Apr 10, 2020, 7:33 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాల్లో లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. ఈ సమయంలో అన్ని రకాల వేడుకలు, పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇలాంటి సమయంలో వినూత్న కార్యక్రమం చేపడుతోంది అమెరికా పెన్సిల్వేనియా అగ్నిమాపక శాఖ. అక్కడి చిన్నారుల పుట్టినరోజు వేడుకలు జరుపుతోంది. ఈ కష్ట సమయంలో ఎన్నో కుటుంబాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

వేడుకలు చేస్తున్నారిలా..

చిన్నారులవి ఎవరివైనా పుట్టినరోజులు ఉంటే... పెన్సిల్వేనియా అగ్నిమాపక శాఖకు ఫేస్​బుక్​ ద్వారా తెలియజేయాలి. సిబ్బంది ఆ బాలలు ఉండే వీధుల్లో ఫైరింజిన్​ సైరన్లు మోగిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు.

"త్వరలో పుట్టినరోజు జరుపుకునే హాలిడేస్‌బర్గ్ బరోలో పిల్లలను గుర్తించి వారి పుట్టిన రోజును నిర్వహిస్తున్నాం. ఈ సమయంలో పుట్టిన రోజులు జరపలేకపోతున్న తల్లిదండ్రులు చిరునామా, ఫోన్​ నంబరును మాకు తెలుపండి. మేము మీ వీధిలో సైరన్​లతో సందడి చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతాం."

-- అగ్నిమాపక శాఖ సిబ్బంది

ఇదీ చదవండి: కరోనా కల్లోలంలోనూ.. ఆశలు చిగురించేన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.