ETV Bharat / international

ఆరోగ్యం కోసం సరికొత్త 'ఫిట్​ మంత్రం'​!

author img

By

Published : Jan 5, 2021, 6:22 PM IST

కరోనా మహమ్మారి అమెరికాలో చాలా మార్పులు తెచ్చింది. భౌతికదూరం అన్న నిబంధనలతో జిమ్​కు వెళ్లి వ్యాయామం చేసే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. దాంతో ఫిట్​గా ఉండేందుకు అక్కడి ప్రజలు సరికొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Outdoor and at home exercise on trend in 2021 at america
ఆరోగ్యం కోసం సరికొత్త 'ఫిట్​ మంత్రం'​!
ఆరోగ్యం కోసం సరికొత్త 'ఫిట్​ మంత్రం'​!

కండలు పెంచాలి.. ఫిట్​గా ఉండాలి.. అనుకునే వారికి కరోనా మహమ్మారి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. లాక్​డౌన్​ ప్రభావంతో జిమ్​లన్నీ మూతపడ్డాయి. తిరిగి తెరుచుకున్నప్పటికీ చాలా మంది వైరస్​ భయంతో జిమ్​లకు వెళ్లే సాహసం చేయడం లేదు. అయితే అమెరికా వాసులు కసరత్తుల కోసం కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అవేంటంటే..

యాప్​ల సాయంతో..

చాలా మంది అమెరికన్లు.. ఇంట్లోనే వ్యాయామం చేసేందుకు కావాల్సిన ఉపకరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. అయితే.. అలాంటివేమీ కొనాల్సిన అవసరం లేకుండానే, ఇంట్లోనే కసరత్తులు చేయొచ్చని అంటున్నారు అమెరికాలోని ప్రముఖ ఫిట్​నెస్​ నిపుణురాలు జిలియన్​ మైకేల్స్​.

"వారంలో ఒకటి లేదా రెండుసార్లు జిమ్​కు వెళ్లే వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే.. వారిలో చాలామంది ఇప్పటికీ.. బహిరంగంగా చేసే వ్యాయామాలను ఇంటి దగ్గరే చేస్తున్నారు. అందుకోసం భారీగా ఖర్చు చేసి, ఉపకరణాలను కొంటున్నారు. కానీ, వాటి అవసరమేమీ లేకుండానే ఇంట్లోనే ఉంటూ ఆన్​లైన్​ శిక్షణ ద్వారా వ్యాయామాలు చేయవచ్చు. జిమ్​కు వెళ్తే కలిగే ఫిట్​నెస్​నూ సాధించవచ్చు.''

-- జిలియన్​ మైకేల్స్​, సెలబ్రెటీ ఫిట్​నెస్​ నిపుణురాలు

జిలియన్​.. 2017లో ఫిట్​నెస్​ యాప్​ను రూపొందించారు. ఆ యాప్​లోనే వ్యాయామాలతో పాటు, ఆరోగ్యకరమైన వంటకాలు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన అంశాలను బోధిస్తున్నారు. కరోనా ప్రభావంతో క్వారంటైన్, హోం​ ఐసొలేషన్​లో ఉన్న చాలా మంది తమ యాప్​ను వినియోగించారని జిలియన్​ తెలిపారు.

బీచ్​లో సరదాగా.. సురక్షితంగా..

భౌతికదూరాన్ని పాటిస్తూ వ్యాయామాలు చేసేందుకు వీలుగా బీచ్​లను ఎంచుకుంటున్నారు చాలా మంది అమెరికన్లు. కాలిఫోర్నియాలోని వెనిస్​ బీచ్​.. బహిరంగ వ్యాయామాలకు చక్కని ప్రదేశంగా మారింది. పసిఫిక్​ సముద్రతీరంలో వాలీబాల్​ ఆడుతూ, జాగింగ్​ చేస్తూ ఎంతోమంది కసరత్తులు చేస్తున్నారు. శారీరకంగా దృఢంగా ఉండడానికి ఇలా విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు.

ఆక్వాయోగాతో హాయిగా..

నీటిపై తేలియాడే బోర్డుపై చేసే యోగాపై అమెరికా వాసులు ఇప్పుడు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. దీనినే 'యోగాఆక్వా' పేరుతో పిలుస్తున్నారు. బోర్డుపై నుంచి పడిపోకుండా చేసే ఈ యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతామని అంటున్నారు. మొదటిసారి సారా తైఫెంతాలర్​ అనే యోగా శిక్షకురాలు దశాబ్దం కిందట ఈ యోగాను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా శిక్షకులకు ఆమె ఈ విద్య నేర్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఈ యోగా నేర్చుకోవడానికి అందరూ ఆసక్తి చూపగా.. వారానికి మూడు రోజుల పాటు అందించే ఈ శిక్షణను ఆమె ఆరు రోజులకు పెంచారు.

"దురదృష్టవశాత్తు ఫిట్​నెస్​కు సంబంధించిన చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కానీ, మాకు మాత్రం ఈసారి చాలా ఆదరణ లభించింది. ఎందుకంటే.. మేం ప్రజలకు అత్యంత జాగ్రత్తగా ఉండేలా వ్యాయామ శిక్షణనిస్తున్నాం. నిజం చెప్పాలంటే.. ఇప్పటి వరకు అన్ని వేసవి కాలాల్లో కెల్లా ఈ వేసవినే చాలా బిజీగా గడిపాం. మేము తీరిక లేకుండా ఉన్న సంవత్సరం కూడా ఇదే.''

-- సారా తైఫెంతాలర్, ఆక్వాయోగా శిక్షకురాలు.

రోజూ దాదాపు పది మంది వరకు యోగా చేస్తూ నీళ్లలో పడిపోతారని సారా అంటున్నారు. కానీ, దాన్ని వాళ్లు సరదాగానే తీసుకుంటున్నారని చెప్పారు. కరోనా తెచ్చిన మార్పులతో ఇలా విభిన్న మార్గాల్లో అమెరికన్లు వ్యాయామాల్లో సరికొత్త ట్రెండ్​లను ఫాలో అవుతున్నారు. ఫిట్​గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆ ఉపగ్రహాల వల్ల జ్యోతిషులకు కొత్త చిక్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.