ETV Bharat / international

కార్చిచ్చుతో వెయ్యి ఇళ్లు దగ్ధం.. ఆపై మంచు తుపాను - కొలరాడోలో మంచుతుపాను

Colorado Fire: అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ఘటనలో దాదాపు వెయ్యి ఇళ్లు దగ్ధమయ్యాయి. కొన్ని గంటల వ్యవధిలోనే వచ్చిన మంచుతుపానుకు ఆ కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాలన్నీ మంచులో కూరుకుపోయాయి.

d
కార్చిచ్చు
author img

By

Published : Jan 2, 2022, 11:47 AM IST

కొలరాడోలో కార్చిచ్చు

Colorado Fire: అమెరికాలోని కొలరాడో రాష్ట్రం భయాందోళనల మధ్యే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గతేడాది డిసెంబరు 30న చెలరేగిన కార్చిచ్చుకు దాదాపు వెయ్యి ఇళ్లు కాలిపోయాయి. ముఖ్యంగా డెనెవర్​, బౌల్డర్​ మధ్య ఉన్న కౌంటీలపై ఈ కార్చిచ్చు ప్రభావం తీవ్రంగా ఉంది. అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. కానీ ముగ్గురు ఆచూకీ గల్లంతైంది. వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ కార్చిచ్చుకు గల కారణాలపై ఇంకా తెలియాల్సి ఉంది.

colorado wildfires
కొలరాడోలో కార్చిచ్చు
colorado wildfires
చెలరేగిన కార్చిచ్చు

కార్చిచ్చు ధాటికి మొత్తం 991 ఇళ్లు కాలిపోయాయి. లూయిస్​విల్లీలో 553, సుపీరియర్​లో 332 సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 106 ఇళ్లు మంటలకు బూడిదయ్యాయి. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.

అంతలోనే మంచు..

రెండు రోజుల పాటు కొలరాడోను కలవర పెట్టిన కార్చిచ్చు దట్టమైన మంచుతో తగ్గుముఖం పట్టింది. కార్చిచ్చు సమస్య నుంచి బయటపడినందుకు స్థానికులు ఊపిరి పీల్చుకున్నా ఈ హిమపాతం వారికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కార్చిచ్చు ధాటికి దగ్ధమైన ప్రాంతాలన్నీ ఇప్పుడు మంచులో కూరుకుపోయాయి. దాదాపు 20 సెంటీమీటర్ల మంచు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.

colorado wildfires
కొలరాడోలో మంచుతుపాను
colorado wildfires
కాలిపోయిన ఇంటిపై పేరుకుపోయిన మంచు

కార్చిచ్చు, మంచుతుపాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. హీటర్లు, తాగునీటి కోసం స్థానికులు బారులు తీరుతున్నారు.

colorado wildfires
దట్టమైన మంచులో కొలరాడో

కొత్త ఏడాదైనా తమకు కాస్త ఊరట కలిగిస్తుందని భావించామని కానీ ఇలా ప్రారంభమవుతుందని తాము ఊహించలేదని స్థానికులు వాపోయారు.

ఇదీ చూడండి : New Year in Space: అంతరిక్షంలో న్యూఇయర్‌ వేడుకల కొత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.