ETV Bharat / international

హత్యల లెక్కలతో పోలీసులకే షాక్ ఇచ్చిన నిందితుడు - సీన్​ లెన్నాన్

ఓ హత్య కేసులో అరెస్టయిన వ్యక్తి.. తాను మరో 15 మందినీ చంపానని చెప్పి పోలీసులకు షాకిచ్చాడు. తన భార్యనూ హత్య చేసినట్లు పేర్కొన్నాడు. ఇది అమెరికాలో సంచలనంగా మారింది.

Man accused of 1 murder says he really killed 16
ఒక వ్యక్తి హత్య కేసులో అరెస్టై..16 హత్యలు చేసినట్లు వెల్లడి
author img

By

Published : Mar 21, 2021, 12:27 PM IST

సీన్​ లెనాన్(47) అనే వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీ పోలీసులకు షాకిచ్చాడు. ఓ వ్యక్తిని అతికిరాతకంగా కొట్టి చంపాడని పోలీసులు అతడిని అరెస్టు చేస్తే.. తాను ఏకంగా 16 హత్యలు చేశాడని చెప్పాడు.

మార్చి 8న..

న్యూజెర్సీకి చెందిన మైకేల్​ డబ్​కౌస్కీ (66)ని లెనాన్​ సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మైకేల్​ కారుతో పరారయ్యాడు. రెండు రోజుల తర్వాత మార్చి 10న మిస్సోరిలోని సెయింట్ లూయిస్ ప్రాంతంలో పోలీసులు లెనాన్​ను అరెస్టు చేశారు. డబ్​కౌస్కీ తనను చిన్నతనంలో లైంగికంగా వేధించినందువల్లే ఈ హత్య చేసినట్లు విచారణలో పోలీసులకు తెలిపాడు. ఇప్పటికే తాను మరో 15 మందిని హత్య చేశాడని ఒప్పుకున్నాడు. మృతుల్లో తన భార్య కూడా ఉందని వెల్లడించాడు.

అనుమానం వచ్చినా...

మార్చి 5న న్యూమెక్సికోలోని అల్​బుకర్​క్యూ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద లెనాన్​ మాజీ భార్య సహా ముగ్గురి మృతదేహాలు కారులో దొరికాయి. పోలీసులకు తొలుత లెనాన్​పై అనుమానం వచ్చినా సరైన ఆధారాలు లేని కారణంగా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా మైకేల్​ హత్య కేసులో పట్టుబడిన లెనాన్... అసలు విషయం వెల్లడించాడు.

అయితే... లెనాన్ 16 హత్యలు చేశాడని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. దర్యాప్తు పూర్తయ్యాకే అసలు విషయం తెలుస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి:సిరియాలో పేలుడు- ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.