ETV Bharat / international

గబ్బిలాలూ 'సెల్ఫ్​ ఐసోలేషన్​'లోకి వెళ్తాయా? - latest science news

గబ్బిలాలు మనుషుల కంటే తెలివైనవా? ఆరోగ్యం బాగా లేకపోతే మనలాగే అవి కూడా ఇతరులకు దూరంగా ఉంటాయా? అంటే అవుననే చెబుతున్నారు పరిశోధకులు. కొన్ని గబ్బిలాలపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

like hums vampire bats isolates themselves when they feel sick
గబ్బిలాలు మనుషుల కంటే తెలివైనవా?
author img

By

Published : Jun 7, 2021, 6:03 PM IST

మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తాం? బయటకు వెళ్లం. స్నేహితులను కలవం. ప్రస్తుత కరోనా సమయంలో అయితే అనారోగ్యంగా ఉన్నవారికి ఆమడ దూరంలో ఉంటాం. మనకే ఇబ్బంది ఎదురైతే సెల్ఫ్​ ఐసోలేషన్​లోకి వెళ్తాం. సరిగ్గా గబ్బిలాలు కూడా మనుషుల్లాగే చేస్తాయని అమెరికా పరిశోధకులు తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి ఈ విషయాలను ధ్రువీకరించారు.

సెంట్రల్ అమెరికాలోని ఓ శాస్త్రవేత్తల బృందం గబ్బిలాలు నివాసం ఉండే ప్రాంతానికి వెళ్లింది. వాటిలో కొన్నింటిని వల వేసి పట్టుకున్నారు బృందంలోని సభ్యులు. ఆ తర్వాత వాటిలో సగం గబ్బిలాలకు సాధారణ సెలైన్​ ఇచ్చారు. మిగతా వాటికి అనారోగ్యమయ్యేలా కెమికల్ లిపోపాలీసచరైడ్(ఎల్​పీఎస్​​) ఇచ్చారు. ఆ తర్వాత వాటికి సెన్సార్లు అమర్చి వాటి నివాసంలోనే వదిలేశారు.

స్నేహితులకు దూరంగా..

అనంతరం గబ్బిలాల కదలికలను పర్యవేక్షించారు పరిశోధకులు. వీటిలో సెలైన్​ ఇచ్చిన గబ్బిలాలు ఎప్పటిలానే స్నేహితులతో కలిసి హాయిగా గడిపాయి. కానీ ఎల్​పీఎస్ కారణంగా అనారోగ్యానికి గురైనవి మాత్రం తమ వారిని కలవలేదు. స్వతహాగా ఇతరులకు దూరం పాటించాయి. ఆరోగ్యంగా ఉన్న గబ్బిలాలు కూడా వాటి దగ్గరకు వెళ్లలేదు.

గబ్బిలాలకు సెన్సార్లు అమర్చి వదిలిన 6 గంటల తర్వాత పరిశోధకులు ఈ విషయాలు కనుగొన్నారు. మనుషుల్లానే గబ్బిలాలు కూడా సామాజిక జీవులని తెలిపారు. ఈ అధ్యయనం భవిష్యత్తులో జంతువులపై జరిపే ప్రయోగాలకు ఉపయోగపడుతుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.