Nuclear Weapons Countries: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే గాక మానవాళికి పెనుముప్పును కల్గించే అణు యుద్ధాల నివారణకు అణుశక్తి దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అణ్వాయుధాల వ్యాప్తిని అడ్డుకుంటామన్న ఐదు అణుశక్తి దేశాలు.. ప్రపంచ శాంతికి కట్టుబడి ఉంటామని భరోసా ఇచ్చాయి.
దేశ రక్షణ కోసం మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగించనున్నట్లు ఉమ్మడి ప్రకటనలో ఈ అయిదు దేశాలు పేర్కొన్నాయి. అణ్వాయుధాలను దుర్వినియోగం చేయకుండా కట్టడికి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశాయి.
ఇదీ చూడండి : ఐసోలేషన్లో ప్రియాంకా గాంధీ.. ప్రచారాలపై ఎఫెక్ట్!