ప్రపంచ శాంతిలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్‌కు 'ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యూఎన్‌ఎస్సీ)' శాశ్వతసభ్యత్వం (India UNSC permanent seat) కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ ప్రతిపాదనపై అమెరికా సైతం సానుకూలంగా స్పందించింది. స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ భారత్‌కు శాశ్వతసభ్యత్వం ఉండాలని ఉద్ఘాటించినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. ఆగస్టు నెలలో యూఎన్‌ఎస్సీ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్.. అఫ్గానిస్థాన్ సంక్షోభ సమయంలో సమర్థంగా పనిచేసిందని బైడెన్ కొనియాడారు. ఈ నేపథ్యంలో భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వతసభ్యత్వం ఉండాలని తాను భావిస్తున్నానన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో భేటీ (Modi in USA) అనంతరం బైడెన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దేశాల్లో భారత్ ఒకటి. ఏడుసార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా(India UNSC membership) వ్యవహరించింది. యూఎన్‌ఎస్సీలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. వీటిలో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా.. మరో 15 దేశాలను తాత్కాలిక సభ్యదేశాలుగా రెండేళ్ల కాలపరిమితితో ఎన్నుకుంటారు.
మోదీ- బైడెన్ భేటీ..
అమెరికా పర్యటనలో భాగంగా(Modi US visit 2021) ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో(Joe Biden news) శుక్రవారం భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news). సుమారు గంటన్నర పాటు ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా.. భారత్‌తో రక్షణ సంబంధాల బలోపేతానికి, సత్సంబంధాలకు(Modi US visit highlights) కట్టుబడి ఉన్నామని జో బైడెన్(Joe Biden news) హామీ ఇచ్చినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. రక్షణ రంగంలో అధునాతన పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంచడాన్ని నాయకులు స్వాగతించారని తెలిపారు.
మరోవైపు.. రక్షణ రంగంలో ఇరు దేశాల భాగస్వామ్యంపై వాస్తవ నివేదికను విడుదల చేసింది శ్వేతసౌధం. '2016 నుంచి ఇరు దేశాల మద్య నాలుగు కీలక రక్షణ ఒప్పందాలు జరిగాయి. సమాచార మార్పిడి, ద్వైపాక్షిక, బహుల పాక్షిక ప్రదర్శనలు, సముద్రాల భద్రత, రవాణా సహకారం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరో మెట్టు ఎక్కించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.' అని తెలిపింది.
జోబైడెన్‌తో తొలిసారి ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ.. హెచ్1బీ సహా అమెరికాలోని భారతీయులకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు ష్రింగ్లా ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌కు చెందిన వృత్తి నిపుణుల ప్రవేశాలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యల్లో భాగంగా వీసాల గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఓ వాస్తవ నివేదిక విడుదల చేసిన శ్వేతసౌధం 2021లో ఇప్పటివరకు 62 వేల విద్యార్థి వీసాలు భారతీయ విద్యార్థులకు జారీ చేసినట్లు తెలిపింది. దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు.. ప్రతి ఏడాది అమెరికా ఆర్థికవ్యవస్థకు 7.7 బిలియన్ డాలర్లు అందిస్తున్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:- 'భారత్‌లో బంధువులు'- మోదీతో భేటీలో బైడెన్ హాస్యం