నింగిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హెలికాప్టర్- ఓ సింగిల్ ఇంజిన్ విమానం ఢీకొనగా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన అమెరికా ఆరిజోనాలోని చాండ్లర్ నగరంలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. విమానంలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.
చాండ్లర్లోని మున్సిపల్ విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి జేసన్ మెక్క్లిమన్స్ తెలిపారు. నేలపై ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. అయితే.. కొన్ని గంటలపాటు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాద సమాచారం అందగానే వెంటనే.. చాండ్లర్ అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ కిందపడిన స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్ శిథిలాలకు ఉన్న మంటలను ఆర్పారు. అక్కడే ఇద్దరి మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. వారి వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ క్వాంటమ్ హెలికాప్టర్స్ సంస్థకు చెందినది కాగా.. విమానం ఫ్లైట్ ఆపరేషన్ అకాడమీకి చెందినదని మెక్క్లిమన్స్ తెలిపారు. ఈ రెండు సంస్థలు ఫ్లైట్ స్కూల్స్ అని చెప్పారు.
ఇదీ చూడండి: China Power Shortage: ప్రపంచ ఫ్యాక్టరీకి కరెంటు దెబ్బ