ETV Bharat / international

కమల, ఫౌచీ పేర్లనే తప్పుగా పలికారు! - తప్పుగా పలికిన పేర్లు

అమెరికా అంటు వ్యాధుల శాస్త్ర నిపుణుడు ఆంటోనీ ఫౌచీ, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ పేర్లను ఈ ఏడాది చాలా మంది తప్పుగా పలికారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ రూపొందించిన జాబితాలో వీరిద్దరి పేర్లకు చోటు లభించింది. వీరితో పాటు పలువురు ప్రముఖులు, ప్రదేశాల పేర్లు ఇందులో ఉన్నాయి. వాటిని ఎలా పలకాలో సంస్థ వివరణ ఇచ్చింది.

Fauci, Kamala among famous names on mispronounced words list
కమల, ఫౌచీ పేర్లనే తప్పుగా పలికారు!
author img

By

Published : Dec 10, 2020, 5:10 PM IST

ఈ ఏడాది ఎక్కువ మంది తప్పుగా పలికిన పేర్ల జాబితాలో అమెరికా అంటువ్యాధుల శాస్త్ర నిపుణుడు ఆంటోనీ ఫౌచీ, ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన కమలా హారిస్​ చోటు దక్కించుకున్నారు. న్యూస్ రీడర్లతో పాటు టీవీ వ్యాఖ్యాతలు పలికేందుకు ఎక్కువగా ఇబ్బంది పడిన పదాలను గుర్తిస్తూ... అమెరికాకు చెందిన క్యాప్షనింగ్ కంపెనీ ఈ జాబితా రూపొందించింది. ప్రముఖ బహుశాస్త్ర నిపుణుడు లియోనార్డో డావిన్చీ పేరు కూడా ఈ జాబితాలో చేరింది.

ఈ జాబితాను రూపొందించేందుకు తమ సభ్యులతో సర్వే నిర్వహించినట్లు తెలిపింది క్యాప్షన్. బాబ్బెల్ లెర్నింగ్ యాప్ సాయంతో ఈ సర్వే చేసినట్లు వెల్లడించింది.

"కరోనా వైరస్, అమెరికా అధ్యక్ష ఎన్నికల సంబంధిత పేర్లు ఈ జాబితాలో ఎక్కువగా చోటు దక్కించుకున్నాయి. వీటిని పలికేందుకు కాస్త సాధన అవసరం."

-టాడ్ ఎహ్రెస్​మన్, భాషా పరిజ్ఞాన నిపుణుడు, బాబ్బెల్

జాబితాలోని పేర్లు.. వాటిని పలికే విధానం

  • Anthony Fauci(AN-thon-nee FOW-chee): ఆంథొనీ ఫౌచీ
  • Bangtan Sonyeondan(PUNG-tahn SOH-nyun-dahn(BTS)): పంగ్టన్ సోహ్నియున్​డన్- దక్షిణ కొరియా కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ పూర్తి పేరు. బులెట్ ప్రూఫ్ బాయ్స్​ అని దీనర్థం.
  • Giannis Antetokounmpo(YON-nis AHN-de-doh-KOON-boh): యొనిస్ అన్డిడొకూన్బో- గ్రీకు బాస్కెట్ బాల్ ప్లేయర్. ఈ ఏడాది ఎన్​బీఏ లీగ్​లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.
  • Isias( ees-ah-EE-ahs ): ఈసాఈయాస్- కరీబియన్, అమెరికా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసిన శక్తిమంతమైన హరికేన్ పేరు.
  • Kamala Harris (CAW-ma-la HAIR-iss): కమలా హెయిరిస్.
  • Leonardo da Vinci (lee-oh-NAR-doe dah-VIN-chee): లీఓనార్డో డావిన్చీ.
  • Mahamayavi Bhagavan Antle (mu-HAH-muh-yaw-vee bag-AH-wahn ANT-uhl)- ముహాహ్ముహ్యావీ బగవాహ్న్ ఆంటుహ్ల్: వైల్డ్​లైఫ్ పార్క్ ఆపరేటర్ 'డాక్ ఆంట్లే' పూర్తి పేరు. నెట్​ఫ్లిక్స్​ రూపొందించిన 'టైగర్ కింగ్' డాక్యుమెంటరీ ద్వారా ఈయనకు విశేష ప్రాచుర్యం లభించింది.
  • Nevada ( nev-ADD-ah ): నెవడ్డా, అమెరికాలోని రాష్ట్రం
  • X Æ A-Xii (EX-aye-eye): ఎక్స్​ అయ్ఎయ్. వ్యాపారవేత్త ఎలాన్ మస్క్, గ్రిమ్స్​కు పుట్టిన తొలి సంతానం పేరు.
  • Yosemite (YOH-sem-it-ee): యోహ్​సెమిటీ, కాలిఫోర్నియాలోని జాతీయ పార్కు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ పదాన్ని తప్పుగా పలికారు.

ఇదీ చదవండి: కరోనా కాదు.. ఐపీఎల్​పైనే మనోళ్ల ఆసక్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.