అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్బుక్ ఖాతాను తొలగించటాన్ని ఆ సంస్థ స్వతంత్ర పర్యవేక్షణ బోర్డు సమర్థించింది. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయటం సబబే కానీ.. శాశ్వతంగా ఖాతాను తొలగించటం సరికాదని స్పష్టం చేసింది. దీనిపై పున:పరిశీలన చేయాలని సంస్థకు సూచించింది.
ఆ పోస్టుల వల్లే..
జనవరి 6న అగ్రరాజ్యంలోని క్యాపిటల్ విధ్వంసానికి.. ట్రంప్ ఫేస్బుక్లో చేసిన పోస్టులే కారణమని ఫేస్బుక్ సంస్థ.. ట్రంప్ ఖాతాను తొలగించింది. ట్రంప్ జనవరి 6న ఫేస్బుక్లో చేసిన రెండు పోస్టులు.. విద్వేషపూరితంగా ఉన్నాయని, సంస్థ నిబంధనలకు ఇవి విరుద్ధంగా ఉన్నాయన్న ఫేస్బుక్ వ్యాఖ్యలను బోర్డు సమర్థించింది. ఒకవేళ ట్రంప్ ఖాతాలను పునరుద్ధిరించాలంటే.. ఏవి ఉల్లంఘన చర్యలకిందకు వస్తాయో స్పష్టంగా వివరించాలని పేర్కొంది. అయితే బోర్డు నిర్ణయంపై ట్రంప్ అధికార ప్రతినిధి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
ఫేస్బుక్ నుంచి తొలగించిన ఖాతాదారులు.. తమ తప్పులు తెలుసుకుని మళ్లీ.. నిబంధనలను అనుగుణంగా నడుచుకునే విధంగా అవకాశం కల్పించాలని బోర్డులోని కొందరు సభ్యులు కోరారు. మరోసామాజిక మాధ్యమం ట్విట్టర్ కూడా.. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించింది.
ఇదీ చదవండి : సమాచార మాధ్యమాన్ని ప్రారంభించిన ట్రంప్