ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' అధినేత ఎలాన్ మస్క్ స్థాపించిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అరుదైన ఘనత సాధించింది. ఫ్లోరిడా కేంద్రంగా చేపట్టిన రెండో 'రైడ్ షేర్' మిషన్‌లో భాగంగా 88 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు స్పేస్ ఎక్స్ పేర్కొంది. ఈ ఏడాదిలో మొత్తంగా 900 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు ఓ స్థానిక మీడియా కథనం ప్రచురించింది.
ట్రాన్స్పోర్టర్-2 మిషన్ కోసం పునర్వినియోగ పాల్కన్-9 రాకెట్ ద్వారా బుధవారం ఈ ప్రయోగం జరిపినట్లు స్పేస్ ఎక్స్ స్పష్టం చేసింది. ఫ్లోరిడాలోని కేప్ కనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రైడ్ షేర్ మిషన్‌ను విజయవంతం చేసినట్లు వెల్లడించింది.
-
Watch Falcon 9 launch 88 spacecraft to orbit → https://t.co/bJFjLCzWdK https://t.co/y3JRM5cDd3
— SpaceX (@SpaceX) June 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watch Falcon 9 launch 88 spacecraft to orbit → https://t.co/bJFjLCzWdK https://t.co/y3JRM5cDd3
— SpaceX (@SpaceX) June 30, 2021Watch Falcon 9 launch 88 spacecraft to orbit → https://t.co/bJFjLCzWdK https://t.co/y3JRM5cDd3
— SpaceX (@SpaceX) June 30, 2021
20వ ప్రయోగం..
ఈ మిషన్‌లో భాగంగా ఫ్లోరిడా కేంద్రంగా స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలను పంపడం ఇది రెండోసారి కాగా.. ఈ ఏడాదిలో స్పేస్ ఎక్స్‌కు ఇది 20వ ప్రయోగం కావడం గమనార్హం.
ప్రస్తుత మిషన్‌లో 85 కమర్షియల్, ప్రభుత్వ స్పేస్ క్రాఫ్ట్‌లు కాగా మూడు స్టార్‌లింక్ ఉపగ్రహాలున్నాయి. ఇందులో క్యూబ్ సాట్స్, మైక్రోసాట్స్, ఆర్బిటర్ ట్రాన్స్ఫర్ వెహికిల్స్ ఉన్నాయి.
జనవరిలో ట్రాన్స్పోర్టర్-1 మిషన్ ద్వారా అత్యధికంగా 143 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది స్పేస్ ఎక్స్. ప్రస్తుతం ట్రాన్స్పోర్టర్-2 పేరిట మరికొన్ని ఉపగ్రహాలను పంపింది.