ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 3.13 కోట్లకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ దేశాలపై కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 3.13కోట్ల మందికిపైగా కరోనా సోకింది. వైరస్​ ధాటికి 9.66 లక్షల మంది బలయ్యారు. బ్రిటన్​లో వైరస్​ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు వైద్యులు. ఇక న్యూజిలాండ్​లో కొద్దిరోజులుగా వైరస్​ జాడ కనిపించనందున లాక్​డౌన్​ను​ పూర్తిగా ఎత్తివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం సన్నద్ధమైనంది.

New Zealand to begin lifting virus restrictions
ప్రపంచవ్యాప్తంగా 3.13 కోట్లకు చేరిన కరోనా కేసులు
author img

By

Published : Sep 21, 2020, 11:04 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కొద్దిరోజులుగా సగటున రోజుకు రెండు లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు 3కోట్ల 13లక్షలమంది వైరస్​ బారినపడ్డారు. వారిలో 9లక్షల 66వేల మందికిపైగా మరణించారు. అయితే.. పెరుగుతున్న కేసులకు అనుగుణంగానే రికవరీ రేటు కూడా క్రమంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు 2కోట్ల 29లక్షలమందికి పైగా మహమ్మారిని జయించారు. 74లక్షల మందికిపైగా వైరస్​తో పోరాడుతున్నారు.

  • కొవిడ్​ కేసులపరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 70.16లక్షల మందికి వైరస్​ సోకింది. వారిలో 2.04లక్షల మందికిపైగా మృతిచెందారు.
  • బ్రెజిల్​లో కేసుల సంఖ్య 45.47 కేసులు నమోదుకాగా.. 1.36లక్షల మరణాలు సంభవించాయి.
  • పాక్​లో సోమవారం ఒక్కరోజే 633 మందికి వైరస్​ సోకింది. కేసుల సంఖ్య 3,06,304కు చేరింది. మరో నలుగురు చనిపోవడం వల్ల.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6,420కు పెరిగింది.
  • నేపాల్​లో కొత్తగా 1,154 కొవిడ్​ కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 65,276కు ఎగబాకింది. ఆ దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో 16మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 427కు చేరింది.

'చర్యలు తీసుకోకపోతే రోజుకు 50వేల కేసులు!'

బ్రిటన్​లో కొవిడ్​ కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో.. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు అక్కడి వైద్యాధికారులు. దేశంలో కరోనా విజృంభణ ఇలాగే కొనసాగితే రోజుకు 50వేల కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. దీంతో మరణాల సంఖ్య కూడా మరింత అధికమవుతుందన్నారు.

ఇంగ్లాండ్​లో ఇప్పటివరకు 3,98,625 కరోనా కేసులు నమోదయ్యాయి. 41,788 మరణాలు సంభవించాయి.

న్యూజిలాండ్​లో లౌక్​డౌన్​ ఎత్తివేత!

న్యూజిలాండ్​లో కొద్దిరోజులుగా కరోనా కేసులు లేకపోవడం వల్ల.. ఆ దేశంలో పూర్తిగా లాక్​డౌన్​ ఆంక్షల్ని ఎత్తివేయనుంది అక్కడి ప్రభుత్వం. అయితే.. ప్రధాన నగరం ఆక్లాండ్​లో మాత్రం ఇంకా 16 రోజులపాటు లాక్​డౌన్​ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం మంత్రిమండలితో సమావేశం అనంతరం.. ఆ దేశ ప్రదాని జెసిండా ఆర్డెర్న ప్రకటించారు.

ఇదీ చదవండి: చైనాలో మరో వ్యాధి- వేల మందికి పాజిటివ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.