ETV Bharat / international

కరోనా వ్యాక్సిన్.. సొరచేపల చావుకొచ్చింది! - shark skalen in covid vaccine

కొవిడ్ వ్యాక్సిన్ వల్ల సొర మత్య్సాల మనుగడ ప్రమాదంలో పడింది. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో సొరచేపల కాలేయం నుంచి తీసే స్కాలేన్ అనే నూనెను వినియోగిస్తున్నారు. ఈ నూనె కోసం అరుదైన సొర చేపలను బలి చేస్తున్నారు.

corona vaccine effecting lives of  shark fish
కరోనా వ్యాక్సిన్.. సొరచేపల చావుకొచ్చింది!
author img

By

Published : Oct 1, 2020, 7:38 AM IST

కరోనా వ్యాక్సిన్ తయారీ.. సొరచేపల(షార్క్) ప్రాణాల మీదకొచ్చింది. కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో సొరచేపల కాలేయం నుంచి తీసే స్కాలేన్ అనే నూనెను వినియోగిస్తున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడే ఈ నూనె కోసం ఎప్పటి నుంచో సొరచేపల వేట కొనసాగుతోంది. ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ తయారీలోనూ దీన్నే వినియోగిస్తున్నారు, దీంతో సొర మత్య్సాల మనుగడ ప్రమాదంలో పడింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే సొరచేపల సంరక్షణ సంస్థ ఒకటి ఈ విషయం తెలిసి ఆందోళన వ్యక్తం చేసింది.

ఒక టన్ను స్కాలేన్ కావాలంటే సుమారు 3 వేల సొరచేపలు అవసరం. ప్రపంచ జనాభా అంతటికి స్కాలేన్ ఉన్న కొవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోసు ఇవ్వాలంటే 2.5 లక్షల సొరచేపలు కావాలి. అదే ఒక్కొక్కరికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే 5 లక్షల సొరచేపలను చంపాలి. అందులోనూ స్కాలేన్ పుష్కలంగా లభించే గల్పర్ షార్క్ బాస్కింగ్ షార్క్ రకాలు అరుదైనవి. అంతరించిపోతున్న జీవుల జాబితాలోనూ ఇవి ఉన్నాయి. ఇతర సముద్ర జీవుల్లా అవి వాటి సంతతిని వేగంగా పునరుత్పత్తి చేసుకోలేవు. కొవిడ్ వ్యాక్సిన్ తయారీ క్రమంలో వాటి వేట ముమ్మరమైతే కొద్ది కాలానికే అంతరించిపోయే ప్రమామదముంది.

"కరోనా మహమ్మారి ఎంతకాలం, ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. వ్యాక్సిన్ కోసం సొరచేపలను చంపడం ఏటేటా పెరుగుతూనేపోతుంది. ఔషధాలలో వినియోగించే ఓ అనుబంధ పదార్థం కోసం అరుదైన జీవులను ఉనికిని ప్రశ్నార్థకం చేయడం సరికాదు" అంటున్నారు సొరచేపల సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు స్టెఫానీ బ్రెండ్ల్.

స్కాలేన్ కోసం ఏటా 30 లక్షల సొరచేపలను చంపేస్తున్నారు. ఔషధాలతో పాటు కాస్మొటిక్స్, యంత్ర సంబంధిత నూనెల తయారీలోనూ దీన్ని వినియోగిస్తున్నారు. సొరచేపల వేటను తగ్గించేందుకు, స్కాలేన్​కు ప్రత్యామ్నాయంగా పులియబెట్టిన చెరకు గడల నుంచి తీసే పదార్థాన్ని వాడేలా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'శుక్రయాన్​-1'లో పాలుపంచుకోనున్న ఫ్రాన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.