ETV Bharat / international

మానవ కణంలో కరోనా ప్రవేశానికి అడ్డుకట్ట - ప్రొటీన్​ క్యాథెస్పిన్​ ఎల్​

కరోనాపై పోరులో మరో కీలక అధ్యయనానికి తెరతీశారు శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి ప్రవేశించి కరోనా వైరస్​కు ఉపయోగపడే రెండు కీలక ప్రోటీన్లను గుర్తించారు. వాటికి అడ్డుకట్ట వేసే పదార్థాలనూ కనుగొన్నారు.

corona news
మానవ కణంలో కరోనా ప్రవేశానికి అడ్డుకట్ట
author img

By

Published : Nov 10, 2020, 5:28 AM IST

మానవ కణాల్లోకి ప్రవేశించి, తన సంఖ్యను పెంచకోవడానికి కరోనా వైరస్​కు ఉపయోగపడే రెండు కీలక ప్రోటీన్లను.. వాటిని అడ్డుకోగల పదార్థాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. కొవిడ్​ కారక సార్స్​-కోవ్​2 వైరస్ బహుళ అంచెల్లో మానవ శరీరంపై దాడి చేస్తుంది. మొదట ఊపిరితిత్తుల లోపల ఉండే కణాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కణ యంత్రాగాన్ని హైజాక్​ చేసి, భారీగా తన ప్రతులను ఉత్పత్తి చేస్తుంది.

కణంలోకి ప్రవేశించడానికి వైరస్​కు 'లైజోజోముల్​ ప్రొటీజ్​ క్యాథెస్పిన్​ ఎల్'​ అనే మానవ ప్రొటీన్​, కణంలో తన ప్రతులను పెంచకోవడంలో 'ఎంపీఆర్​వో' అనే వైరల్​ ప్రోటీన్​ను వైరస్​ ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న పదార్థాల్లో.. వీటిని అడ్డుకునే సామర్థ్యమున్న వాటిని తాము గుర్తించామని దక్షిణ ఫ్లోరిడా ఆరోగ్య విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త యు చెన్​ తెలిపారు. వీటిని కాల్ఫైయిన్​ ఇన్హిబిటర్స్-2,12గా పిలుస్తున్నట్లు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.