ETV Bharat / international

చైనా రాకెట్ కూలేది ఎక్కడంటే..? - అమెరికా రక్షణశాఖ

చైనా ప్రయోగించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ భూమిపై కూలే ప్రాంతాన్ని అమెరికా రక్షణశాఖ గుర్తించింది. తుర్కమెనిస్థాన్‌లో జనసమర్థం ఉండే ప్రాంతంలోనే ఇది కూలే అవకాశం ఉందని అంచనా వేసింది. రాకెట్‌ శకలాలు భూమిని ఢీకొనే చోట పెద్దఎత్తున విధ్వంసం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

china rocket
చైనా రాకెట్
author img

By

Published : May 8, 2021, 9:23 PM IST

Updated : May 8, 2021, 10:05 PM IST

చైనా గత నెల 29 న ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5-బీ రాకెట్ భూమిపై కూలేదిశగా ప్రయాణిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. 8 టన్నుల బరువున్న ఈ భారీ రాకెట్‌ విడిభాగం మధ్యఆసియా దేశమైన తుర్కమెనిస్థాన్‌లో కూలనున్నట్లు అంచనా నేసింది.

జనసమర్థం ఉన్న చోటే

జనసమర్థం ఉన్న ప్రాంతంలోనే ఢీకొననున్నట్లు హెచ్చరించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నాలుగున్నరకు ఇది భూమిని ఢీకొంటుందని తెలిపింది అమెరికా రక్షణ శాఖ . రాకెట్‌ విడిభాగం ఎక్కడ పడినా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంటకు 18వేల మైళ్ల వేగంతో భూమి మీదకు ప్రయాణిస్తుందని వివరించారు. రాకెట్ వేగాన్ని అది అనుసరిస్తున్న మార్గాన్ని అమెరికా స్పేస్ కమాండ్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు.

డ్రాగన్ వాదన మరోలా

చైనా రాకెట్‌తో ముప్పు ఉందని ఆందోళనలు వెల్లువెత్తుతున్న వేళ డ్రాగన్ వాదన మరోలా ఉంది. రాకెట్‌ శకలాలు భూమిని తాకే లోపలే కాలిపోతాయని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ తమను తాము సమర్థించుకున్నారు.

ఇదీ చూడండి: రాకెట్ ముప్పుపై పెదవి విప్పిన చైనా

చైనాకు ఇలాంటి ప్రమాదపు ప్రయోగాలు కొత్తేమీకాదు, గతేడాది ప్రయోగించిన లాంగ్ మార్చ్‌ రాకెట్‌ విడిభాగాలు ఐవరీ కోస్ట్‌ దేశంలో పడ్డాయి.పెద్దఎత్తున ఆవాసాలు కూలినప్పటికీ ప్రాణ హాని మాత్రం జరగ లేదు.

ఇదీ చదవండి : అదుపుతప్పిన రాకెట్.. భూమిపైకి శకలాలు!

Last Updated : May 8, 2021, 10:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.