భారత్, పాకిస్థాన్ నుంచి వచ్చే ప్యాసింజర్, వాణిజ్య విమానాలపై కెనడా 30 రోజుల పాటు నిషేధం విధించింది. ఈ రెండు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతన్నందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని కెనడా రవాణా శాఖ మంత్రి ఒమర్ అల్ గబ్రా తెలిపారు. అయితే కార్గో విమానాలపై ఎటువంటి నిషేధం లేదని అన్నారు. గురువారం (ఏప్రిల్22) రాత్రి 11:30(స్థానిక కాలమానం ప్రకారం) నుంచే నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
భారత్, పాక్‌ల నుంచి మూడో దేశం ద్వారా వచ్చే ప్రయాణికులు కరోనా నెగెటెవ్ వచ్చిన తర్వాతే కెనడా రావాలని అక్కడి అధికార యంత్రాంగం తెలిపింది.
ఇదీ చదవండి: వాయు కాలుష్య నియంత్రణకు బైడెన్ కొత్త ప్లాన్!