అమెరికాలో పోలీసుల దాష్టీకానికి ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. జాతి వివక్షకు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని శాంతియుతంగా నిరంతరం కొనసాగిస్తామని నిరసనకారులు ప్రతిజ్ఞ చేశారు. పలు నగరాల్లో ఆందోళనలకు శ్వేతజాతీయులు మద్దతుగా నిలుస్తున్నారు.
మినియాపొలిస్‌లో పోలీసు చోక్హోల్డ్లను నిషేధించడానికి అధికారులు అంగీకరించారు. ఫ్లాయిడ్ మరణంపై పౌరహక్కుల దర్యాప్తును కూడా ప్రారంభించారు. మొదట్లో నిరసనలు హింసాత్మకంగా సాగినప్పటికీ, ఇప్పుడు శాంతియుతంగా సాగుతున్నాయి.
అంతిమ సంస్కారం
ఫ్లాయిడ్‌ను కుటుంబ సభ్యులు, ప్రజలు చివరిసారి చూసేందుకు వీలుగా ఆయన పార్థివ దేహాన్ని నార్త్ కరోలినాకు తీసుకెళ్లారు. ఆయన ఎక్కువ కాలం జీవించిన టెక్సాస్‌లో సోమ, మంగళవారాల్లో ఆయన అంతిమ సంస్కారాలు జరపనున్నారు.
బ్లాక్ లివ్స్ మ్యాటర్
జాతి వివక్ష అంతమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని న్యూయార్క్‌లో నిరసనకారులు ప్రతిజ్ఞ చేశారు. వాషింగ్టన్‌లోని శ్వేతసౌధానికి వెళ్లే మార్గంలో రోడ్డుపై 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' అనే నినాదాన్ని రాశారు. ఆ వీడియోను మేయర్ బౌసర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
![Protesters defy New York curfew to march for Floyd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest.jpg)
![Protesters defy New York curfew to march for Floyd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest5.jpg)
ఆస్ట్రేలియాకు పాకిన ఉద్యమం
అమెరికాలో మొదలైన 'బ్లాక్ లివ్స్ మ్యాటర్' నిరసనలు ఇప్పుడు ఆస్ట్రేలియాను కూడా అట్టుడికిస్తున్నాయి. ఫ్లాయిడ్‌కు నివాళిగా జరిగిన ప్రదర్శనలను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
మరోవైపు సిడ్నీలో నిరసన ప్రదర్శనలను నిషేధిస్తూ సిడ్నీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలా ప్రజలు సామూహికంగా గుమిగూడితే.. కరోనా వైరస్ విపరీతంగా ప్రబలే ప్రమాదముందని హెచ్చరించింది. అయినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గడం లేదు.
![Australia protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest3.jpg)
![Protesters defy Sidney curfew to march for Floyd I](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest4.jpg)
మెక్సికోలో నిరసనలు
మెక్సికోలోని అమెరికా దౌత్య కార్యాలయం ముందు సుమారు 100 మంది నల్లజాతీయులు నిరసనలు చేపట్టారు. అమెరికాలో జాతివివక్షకు గురై ఫ్లాయిడ్ చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జాతివివక్ష నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తరువాత వీధుల్లో ప్రదర్శనగా వెళ్లి బస్సు స్టాప్‌లు, బ్యాంకులు, దుకాణాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.
![PROTEST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest1.jpg)
అన్యాయంగా చంపేశారు
ఇటలీలోని రోమ్ నగరంలో అమెరికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్.. జార్జి ఫ్లాయిడ్ మరణానికి పోలీసులు కారణమవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక నల్లజాతీయుడి మెడపై కాలుపెట్టి ఓ పోలీసు అధికారి ఊపిరి ఆడకుండా చేయడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జాత్యహంకారం, జాతి వివక్ష నశించాలని పిలుపునిచ్చారు.
![Protesters defy New York curfew to march for Floyd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest9.jpg)
![stop black deaths](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest2.jpg)
![surfers in US](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest8.jpg)
![surfers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest6.jpg)
![US PORTEST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7499590_us-protest7.jpg)
ఇదీ చూడండి: 'పరీక్షలు పెంచితే మా కంటే భారత్‌లోనే ఎక్కువ కేసులు'