ETV Bharat / international

'వ్యాక్సిన్‌ వేయించుకుంటే 100 డాలర్లు ఇవ్వండి' - టీకా ప్రోత్సాహకాలు బైడెన్

అమెరికాలో మరోసారి కరోనా విజృంభిస్తుండటం వల్ల వ్యాక్సినేషన్​ను వేగవంతం చేసేందుకు నగదు ప్రోత్సాహకాలను ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. వ్యాక్సినేషన్‌ రేటు మరింతగా పెంచేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఉపకరిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాలు తమ కొవిడ్‌ ఉపశమన చట్టం నుంచి నిధులు ఖర్చు చేయవచ్చన్నారు బైడెన్​.

joe biden vaccines, వ్యాక్సినేషన్​ ఆఫర్లు బైడెన్
Joe Biden: వ్యాక్సిన్‌ వేయించుకుంటే 100 డాలర్లు ఇవ్వండి!
author img

By

Published : Jul 31, 2021, 2:00 AM IST

కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటం వల్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దేశంలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. ఇప్పటివరకు ఇంకా వ్యాక్సిన్‌ వేయించుకోని వారు ముందుకొచ్చేలా నగదు రివార్డులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్‌ రేటు మరింతగా పెంచేందుకు ఇలాంటి ప్రోత్సాహకాలు ఉపకరిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. క్రొగెర్‌ గ్రోసరీ స్టోర్‌ కూడా ఇలాంటి ప్రయత్నం చేయగా ఆ సంస్థ ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్‌ రేటు 50శాతం నుంచి 75శాతానికి పెరిగిందని శ్వేతసౌధం పేర్కొంది. అలాగే, న్యూ మెక్సికో, ఒహైయో, కొలరాడోలలోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలకు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాలు/ప్రాంతాలు తమ కొవిడ్‌ ఉపశమన చట్టం నుంచి నిధులు ఖర్చు చేయవచ్చని బైడెన్‌ సూచించారు.

టీకాలు వృథా అవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ఎక్స్​పైరీ డేట్​ను పొడిగిస్తున్నట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు. వ్యాక్సిన్ల నిల్వకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరు నెలల వరకు అవి సురక్షితం సహా ప్రభావితంగా కూడా ఉంటాయని జాన్సన్​ అండ్ జాన్సన్​ సంస్థకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను విస్తృతం చేసేందుకు రాష్ట్రాలు చర్యలను వేగవంతం చేశాయి.

మరోవైపు, సీడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా జనాభాలో దాదాపు 50శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది. అలాగే, గత వారం రోజులుగా రోజూ దాదాపు 60వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూస్తుండటం వల్ల మళ్లీ కలవరం మొదలైంది. ఈ నెల 27న కొవిడ్‌ హాట్‌స్పాట్‌లుగా ఉన్న ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తయిన వ్యక్తులతో పాటు ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని సీడీసీ ఆదేశాలు జారీచేయడం గమనార్హం.

ఇదీ చదవండి : 'ఆ రెండు టీకాలు కలిపి ఇస్తే కరోనా నుంచి రక్ష!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.