ETV Bharat / international

అమెరికా పౌరసత్వానికి పాత పద్ధతికే బైడెన్​ జై​ - 2020 civics test

అమెరికా పౌరసత్వం ప్రక్రియకు సంబంధించి గతేడాది అమలులోకి వచ్చిన విధానాన్ని అధ్యక్షుడు బైడెన్ రద్దు చేశారు. ఆ స్థానంలో ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన విధానాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.

biden, test
పౌరసత్వం కోసం పాత విధానాన్ని పురుద్ధరించిన బైడెన్​
author img

By

Published : Feb 24, 2021, 10:21 AM IST

అమెరికా పౌరసత్వం లభించడం సులభతరం చేసే దిశగా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహించే పరీక్షల్లో మార్పులు తేనున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ గతేడాది డిసెంబరులో ప్రవేశపెట్టిన 2020 సివిక్స్ టెస్ట్​ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ స్థానంలో అంతకుముందు ఉన్న విధానాన్ని (2008 సివిక్స్ టెస్ట్​) పునరుద్ధరించనున్నారు. ఈ ప్రక్రియ మార్చి 1 నుంచి అమలులోకి వస్తుందని యూఎస్​ సిటిజన్​షిప్​ అండ్​ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్​ (యూఎస్​సీఐఎస్​) వెల్లడించింది.

"ఈ చర్య మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపైన నమ్మకం కలిగించేలా ఉంది. 2020 సివిక్స్​ టెస్ట్​లో ఉన్న లొసుగులను ఇది తొలగిస్తుంది. 2008 సివిక్స్ టెస్ట్​ 150పైగా సంస్థల సూచనలను పరిగణించి రూపొందించినది. 2020 డిసెంబరు 1 తర్వాత లేదా ఈ ఏడాది మార్చి 1 లోపు దరఖాస్తు చేసుకున్న వారు ఏ విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు."

-అధికారులు, యూఎస్​సీఐఎస్

కొత్త విధానంలో లోపాలేంటి?

పౌరసత్వం కోసం పొందే ప్రక్రియలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అమెరికా సిద్ధాంతాలు, ప్రభుత్వ విధివిధానాలు, చరిత్ర మొదలైన అంశాల మీద అభ్యర్థులకు ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. అయితే ఇందుకు సంబంధించి ట్రంప్​ తెచ్చిన కొత్త విధానంలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ప్రశ్నల సంఖ్య 100 నుంచి 128కు పెంచడం సహా సమాధానాలు అన్ని రాజకీయ కోణంలో ఉన్నాయని అభ్యర్థులు ఆరోపించారు. ​

ఇదీ చదవండి : ఆస్ట్రేలియాలో 'ఫేస్‌బుక్' ‌- రాజీ కుదిరింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.